హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

PUBG Relaunch In India: మళ్లీ రానున్న PUBG.. ముందు వాళ్లకు మాత్రమే...

PUBG Relaunch In India: మళ్లీ రానున్న PUBG.. ముందు వాళ్లకు మాత్రమే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PUBG.. ఈ గేమ్ గురించి చెబితేనే యువత వెర్రెత్తిపోతున్నది. నిద్రాహారాలు మాని.. గంటల తరబడి ఈ ఆటను ఆడటానికి యువత ఆసక్తి చూపారు. కానీ చైనా తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసిన విషయం విదితమే. కానీ దీనిని మళ్లీ లాంచ్ చేయనున్నారని సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

PUBG.. ఈ గేమ్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కుర్రకారుకు మంచి కిక్ ఇచ్చే గేమ్ గా పాపులరైంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పబ్ జీ ని భారత ప్రభుత్వం సెప్టెంబరు 2న నిషేధించింది. అప్పటి నుంచి ఈ గేమ్ కోసం ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా PUBG గేమ్ ను తిరిగి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై PUBG మొబైల్ ఇండియా ముందడుగు వేసిందని, ఐఫోన్ యూజర్లకంటే ముందుగానే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకమైన వర్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

కొన్ని ఆన్ లైన్ నివేదికలు, వినియోగదారుల ప్రకారం త్వరలో తిరిగి లాంచ్ కానున్న పబ్జీ గేమ్ ను మొదట ఆండ్రాయిడ్ యూజర్లకు వస్తుందని పేర్కొన్నారు. ఈ ఆట ఐఓఎస్ వర్షన్ కొన్ని రోజుల తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికొస్తే యూజర్లు వెబ్ సైట్ లో రెండు బటన్లు ఉన్న నూతన బ్యానర్ చూస్తారు. ఒకటి వీక్షుకుడిని ప్లే స్టోర్ జాబితాకు మళ్లిస్తుంది. మరొకటి సర్వర్ల నుంచి నేరుగా APK ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే PUBG కార్పోరేషన్ వెబ్ సైట్ ను అభివృద్ధి చేస్తోందని, త్వరలో మరిన్ని వివరాలతో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అప్పటి వరకు ఎలాంటి లింక్స్ పనిచేయవు. భారత్ లో గేమ్ లాంచ్ అయ్యే అంశం గురించి ఆ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన, ఎలాంటి అధికారిక నివేదిక లేవు. దీన్ని బట్టి చూస్తే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఒకే సమయంలో విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

PUBG మైబైల్ ఇండియా గురించి..

ఈ సంస్థ భారత్ లో సేవలందించేందుకు PUBG కార్బోరేషన్ ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ. కంపెనీ ప్రణాళికల్లో భాగంగా భారత్ కోసం అనుబంధ సంస్థను స్థాపించాలని ప్రకటించబడింది. అంతేకాకుండా భారత ఆటగాళ్లకు ప్రత్యేక వర్షన్ తో పాటు నిర్దిష్ట అనుకూలికరణలను అందిస్తారని వెల్లడించారు. ఇప్పుడు ఈ సంస్థ కార్పేరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా గుర్తించింది. అయితే గేమ్ అధికారికంగా విడుదలైనప్పుడు మాత్రమే వర్తిస్తుంది.

PUBG మొబైల్ ఇండియా నవంబరు 20న దేశంలో గేమ్ విడుదల చేస్తుందని వదంతులు వినిపించినప్పటికీ ఇందుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ లేదు. మరికొన్ని రోజులు వేచిచూడాల్సి. అయితే పబ్జీ కార్ప్ కచ్చితంగా పబ్జీ మొబైల్ ఇండియాను ముందుకు సాగుతోంది. వెబ్ సైట్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ హ్యాండిల్స్, యూట్యూబ్ ఛానెల్ కు అంకితం చేయబడింది.అంతేకాకుండా కంపెనీ భారత్ లో తిరిగి రావడానికి ఓ టీజర్ ను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు ప్రముఖ PUBG ప్లేయర్లయిన ఆదిత్య డైనమో సావంత్ జోనాథన్ అమరల్, చేతన్ క్రోటెన్ చాంద్ గుడే ఉన్నారు.

త్వరలో విడుదలకానున్న పబ్జీ మొబైల్ ఇండియా వర్చువల్ సిమ్యూలేషన్ ట్రైనింగ్ గ్రౌండ్, ప్రారంభం నుంచి దుస్తులు ధరించడం, గ్రీన్ హీట్ ఎఫెక్టులు రానున్నాయి. అంతేకాకుండా యువ ఆటగాళ్లలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి ఆట సమయంలో పరిమితిని ఉంచే సెట్టింగ్స్ సహా అనుకూలించే కంటెంట్ ను కలిగి ఉంటుంది.

Published by:Srinivas Munigala
First published:

Tags: PUBG, PUBG Mobile India

ఉత్తమ కథలు