సామాజిక మాధ్యమాల (Social Media) విప్లవంతో సినిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా రాకతో సినీ సెలెబ్రెటీలే నేరుగా తమ సినిమాలను పబ్లిసిటీ చేసుకునే బ్రహ్మాండమైన అవకాశం లభించింది. నేరుగా అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అద్భుత సాధనంగా సోషల్ మీడియాను భావిస్తున్నారు. దీన్ని గుర్తించే సెలబ్రెటీలందరూ ట్విట్టర్(Twitter), ఇన్స్టాగ్రామ్(Instagram) వంటి ప్లాట్ ఫార్మ్‌లలో అకౌంట్ క్రియేట్ చేసుకొని తమ అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ను అందిస్తూ వారిని అలరిస్తున్నారు. 2020 ఏడాది కరోనా ప్రభావంతో విధించిన లాక్డౌన్ (lockdown)తో ప్రజలందరూ ఇంట్లోకే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా మంది నెటిజన్లు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై గడిపారు.
లాక్డౌన్ పుణ్యమా అని సెలబ్రెటీల (celebrity) ఫాలోవర్ల (followers) సంఖ్య విపరీతంగా పెరిగింది. కాగా, ప్రస్తుతం మన దేశంలో అత్యధికులు ఫాలో అవుతున్న సినీ సెలబ్రిటీలపై ఓలుక్కేద్దాం.
ట్విట్టర్ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ సెలబ్రెటీస్..
అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)

అమితాబ్ బచ్చన్
వయసు మీదపడుతున్న కొద్దీ వ్యక్తిగత కరిష్మా అంతకంతకూ పెంచుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ఆయనకు ట్విట్టర్లో 44.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీగా అమితాబ్ నిలిచారు. బాలీవుడ్‌లోని షహెన్షాగా పేరొందిన బిగ్ బి తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
సల్మాన్ ఖాన్(Salman Khan)
అభిమానులు బి-టౌన్ ‘భైజాన్’గా పిలుచుకునే సల్మాన్ ఖాన్ 41.8 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో, సల్మాన్ తన రోజూవారి దినచర్యను ఫాలోవర్స్‌తో పంచుకొని వారిని అలరించాడు.
షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)
బాలీవుడ్ బాద్షాగా అభిమానులు పిలుచుకునే షారుఖ్ ఖాన్ అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ట్విట్టర్లో ఆయనకు 41.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. షారుఖ్ తన ట్విట్టర్ ద్వారా అప్పుడప్పుడు ‘Ask SRK’ సెషన్‌ను నిర్వహిస్తుంటాడు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
అక్షయ్ కుమార్(Akshay Kumar)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ 40 మిలియన్ల మంది ట్విటర్ ఫాలోవర్స్ తో నాలుగో స్థానంలో ఉన్నారు. అక్షయ్ తరచూ తన సినిమాల ప్రమోషన్, పలు సమస్యలపై తన ఆలోచనలను వ్యక్తీకరించడానికి ట్విట్టర్ వేదికను ఉపయోగించుకుంటాడు.
ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ సెలబ్రెటీస్..
విరాట్ కోహ్లీ(Virat Kohli)
భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఆయనకు ఇన్స్టాగ్రామ్ లో 83.2 మిలియన్ల (సుమారు 8.3 కోట్ల పై మాటే) కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీగా విరాట్ నిలిచాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు. అంతేకాక, తన భార్య, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మతో ఉన్న ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటాడు.
ప్రియాంక చోప్రా(Priyanka Chopra)

ప్రియాంక,దీపికా (Instagram/Photo)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 59 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఉన్నారు. దీంతో జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.
శ్రద్ధా కపూర్(Shraddha Kapoor)
ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌కు 57.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీల జాబితాలో శ్రద్ధా మూడో స్థానంలో నిలిచింది.
దీపికా పదుకొనే(Deepika Padukone)
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 52.4 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రెటీల జాబితాలో దీపికా నాల్గవ స్థానంలో నిలిచింది. దీపిక తరచూ తన సినిమాలకు సంబంధించిన పోస్టులను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.
అలియా భట్(Alia Bhatt)
బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 50.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీల జాబితాలో ఆమె అయిదో స్థానాన్ని దక్కించుకుంది. అలియా 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.