హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: గాల్లో ఉండగా విమానం ఇంజిన్ ఫెయిల్.. పైలట్ ఏం చేశాడో చూడండి..

Viral Video: గాల్లో ఉండగా విమానం ఇంజిన్ ఫెయిల్.. పైలట్ ఏం చేశాడో చూడండి..

విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్ అయింది. ముందుకు వెళ్లలేమని పైలట్ ధృవీకరించకున్నాడు. ఎంతో చాకచక్యంగా ఫ్లోరిడా ఎవర్‌గ్లేడ్స్ మారుమూల ప్రాంతంలో క్రాష్ ల్యాండింగ్ చేశాడు. ఆ వీడియో ఇక్కడ చూడండి.

  మన దేశంలో ప్రైవేట్ విమానాల వినియోగం చాలా తక్కువ. కానీ అమెరికాలో కొంత మంది ప్రైవేట్ విమానాల్లో కూర్చొని ఎంచక్కా తమకు నచ్చిన చోటుకు వెళ్తుంటారు. అయితే జాగ్రత్తలు తీసుకోకుండా విహరిస్తే ప్రమాదాలు తప్పవని ఫ్లోరిడాలో జరిగిన తాజా ప్రమాదం గుర్తుచేస్తోంది. ఫ్లోరిడాకు చెందిన 21 ఏళ్ల జోస్ ఎకారీ అనే యువకుడు తన పైలెట్ స్నేహితుడితో కలిసి టామియామి నుంచి ఆర్కాడియాకు ప్రైవేట్ విమానంలో బయలుదేరారు. వారిద్దరూ కలిసి తమకు ఇష్టమైన ఆహారం తినేందుకు టాకో స్టాల్‌కు వెళ్లాలనుకున్నారు. కానీ ప్రయాణం మధ్యలో విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో పైలెట్ చాకచక్యంగా ఫ్లోరిడా ఎవర్‌గ్లేడ్స్ మారుమూల ప్రాంతంలో క్రాష్ ల్యాండింగ్ చేశాడు. ఫలితంగా ఈ ఇద్దరు యువకులు పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. కానీ దాన్ని తిరిగి ప్రారంభించలేక అక్కడే చిక్కుకున్నారు.

  ఈ ప్రమాదంపై ఎకారీ స్థానిక వార్తాసంస్థతో మాట్లాడుతూ "మేము భూమి నుంచి 2,000 అడుగుల ఎత్తులో మా విమానంలో ప్రయాణిస్తున్నాం. అయితే, సడన్గా విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో విమానంలో ప్రయాణించడం సురక్షితం కాదనిపించింది. వెంటనే పైలెట్ చాకచక్యంగా సేఫ్ ల్యాండింగ్ చేశాడు. సాధారణంగా ఈ రకమైన ప్రమాదం నుంచి ఎవ్వరూ బయటపడరు. కానీ మేం సురక్షితంగా బయటపడ్డాం. మేం చాలా అదృష్టవంతులమని భావిస్తున్నాం” అని చెప్పారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న మయామి-డేడ్ ఫైర్ రెస్క్యూ సిబ్బంది విమానం క్రాష్ అయిన ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్లి వారిని రక్షించింది.

  సురక్షితంగా బయటపడ్డ యువకులు..

  స్థానిక వార్తా సంస్థలు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశాయి. ఫుటేజీని పరిశీలిస్తే.. మయామి-డేడ్ ఫైర్ రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఇద్దరు యువకులను రక్షిస్తున్న సమయంలో విమానం చుట్టూ వారిద్దరూ తిరుగుతూ కనిపించారు. రెస్క్యూ ఛాపర్ ఒక పొడవాటి త్రాడు ద్వారా హెలికాప్టర్ నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత అదే తాడు సహాయంతో ఎకారిని హెలికాప్టర్లోకి ఎక్కించుకొని సమీపంలోని ఫైర్ కంట్రోల్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  కొన్ని నెలల క్రితం మెక్సికోలో ఇలాంటి విమాన ప్రమాదమే ఒకటి జరిగింది. ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ విమానంలో కాంకున్ బీచ్ మీదుగా వెళ్తుండగా.. ఇంజన్ ఫెయిలై ఒక్కసారిగా నీటిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో ప్రమాదంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారును విమానం ఢీకొట్టడంతో కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు.

  First published:

  Tags: America, Plane Crash, Us news

  ఉత్తమ కథలు