సీఎం జగన్‌కు బిగ్ షాక్.. పీసీఐ నోటీసులు జారీ..

సీఎం జగన్ ప్రభుత్వం జారీ చేసిన మీడియా జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. మీడియాపై విడుదల చేసిన 2430 జీవో అంశాన్ని సుమోటోగా తీసుకున్న పీసీఐ.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

news18-telugu
Updated: November 2, 2019, 4:37 PM IST
సీఎం జగన్‌కు బిగ్ షాక్.. పీసీఐ నోటీసులు జారీ..
సీఎం జగన్
  • Share this:
ఫేక్ న్యూస్ సృష్టించినా.. వాటిని షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించింది. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను రూపొందిస్తున్నారని జగన్ దృష్టికి రావడంతో తప్పుడు వార్తలను కట్టడి చేసి ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. అయితే, సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటీసు


మీడియాపై విడుదల చేసిన 2430 జీవో అంశాన్ని సుమోటోగా తీసుకున్న పీసీఐ.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పీసీఐ చైర్మన్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు 30న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆందోళన కలిగించేలా ఉందని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జీవోపై వివరణ ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి, సమాచార ముఖ్య కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు.
First published: November 2, 2019, 4:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading