భారతరత్న అవార్డు అందుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

ఆయనతో పాటు దివంగత సింగర్-మ్యూజిషియన్ భూపేన్ హజారికా, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు దివంగత నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్నను ప్రధానం చేశారు.

news18-telugu
Updated: August 8, 2019, 6:44 PM IST
భారతరత్న అవార్డు అందుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారతరత్న అవార్డు అందుకున్న ప్రణబ్ ముఖర్జీ
  • Share this:
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును అందుకున్నారు. ఆయనతో పాటు దివంగత సింగర్-మ్యూజిషియన్ భూపేన్ హజారికా, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు దివంగత నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్నను ప్రధానం చేశారు. వీరిలో భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌కు మరణానంతరం భారతరత్న వరించింది. ఈ నేపథ్యంలో భూపేన్ హజారికా అవార్డును ఆయన కుమారుడు తేజ్ హజారికా అందుకోగా, నానాజీ అవార్డును దీన్‌దయాళ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ వీరేంద్రజిత్ సింగ్ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

ఈ జనవరిలో ప్రణబ్ ముఖర్జీ,భూపేన్ హజారికా,నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ ముఖర్జీ సేవలను కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ అద్భుతమైన రాజనీతివేత్త అని ప్రశంసించారు. నిస్వార్థంగా,అలుపెరగకుండా దశాబ్దాల పాటు ఆయన దేశ సేవ చేశారని అన్నారు. ఆయన భారతరత్న అందుకోవడాన్ని గొప్పగా భావిస్తున్నట్టు తెలిపారు.భారతరత్న ప్రకటన తర్వాత స్పందించిన ప్రణబ్.. దేశానికి తాను ఇచ్చిన దానికంటే దేశం ఎక్కువ ఇచ్చిందని చెప్పారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ(83) 2012-2017 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>