హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గుజరాత్ పర్యటనలో ద్రౌపది ముర్ము.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన రాష్ట్రపతి.. వీడియో వైరల్..

గుజరాత్ పర్యటనలో ద్రౌపది ముర్ము.. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన రాష్ట్రపతి.. వీడియో వైరల్..

చరఖాను తిప్పుతున్న రాష్ట్రపతి

చరఖాను తిప్పుతున్న రాష్ట్రపతి

Gujarat: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

మహత్మగాంధీ (Mahatma Gandhi) జయంతిని మనదేశంతో పాటు, విదేశాలలో ఉన్న వారు కూడా ఘనంగా జరుపుకున్నారు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో బాపూ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)  రెండు రోజుల పాటు గుజరాత్ పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె ₹ 1,330 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నట్లు పిటిఐ తెలిపింది. ఈ క్రమంలో గుజరాత్ చేరుకున్న రాష్ట్రపతి సబర్మతి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ గాంధీ ఆశ్రమంలో ఉత్సాహంగా చరఖాను తన చేతిలో తిప్పారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం గుజరాత్‌లోని (Gujarat)  అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ముఖ్యంగా, అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని (Mahatma Gandhi) జరుపుకున్న ఒక రోజు తర్వాత ఆమె సబర్మతి గాంధీ ఆశ్రమాన్నిm(Sabarmati Gandhi Ashram)  సందర్శించడం గమనార్హం. ఆమె పర్యటన సందర్భంగా, రాష్ట్రపతి ఆశ్రమంలో చరఖాను (Spins Charkha) తిప్పారు. దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ANI ట్విట్టర్‌లో షేర్ చేసింది. మహాత్మా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

మహాత్మా గాంధీని "బాపు" అని పిలుస్తారు. "స్వరాజ్ (స్వీయ-పరిపాలన)", "అహింస (అహింస)" పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అతను గుజరాత్‌లోని పోర్‌బందర్ పట్టణంలో 1869లో జన్మించారు. అతను అహింసాత్మక ప్రతిఘటనను అవలంబించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ పోరాటంలో ముందంజలో ఉన్నారు. ఆదివారం, రాష్ట్రపతి ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ కూడా ఢిల్లీలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు.

ఈ క్రమంలో.. గాంధీ అంతిమ విశ్రాంతి స్థలమైన రాజ్‌ఘాట్‌ను, తర్వాత శాస్త్రి స్మారక స్థూపం అయిన విజయ్ ఘాట్‌ను సందర్శించారు. కాగా, రాష్ట్రపతి గౌరవార్థం గాంధీనగర్‌లో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంను ఏర్పాడు చేసింది. అక్టోబరు 4న.. ఆమె 'హర్‌స్టార్ట్' - మహిళా పారిశ్రామికవేత్తల కోసం గుజరాత్ విశ్వవిద్యాలయం యొక్క ప్రారంభ వేదిక, గుజరాత్ విశ్వవిద్యాలయంలో విద్య , గిరిజన అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Draupadi Murmu, Gujarat, Mahatma Gandhi, Viral Video