Cow dung: ఆవు పేడతో విగ్రహాలు, మొబైల్​ స్టాండ్లు.. లక్షలు తెచ్చిపెడుతున్న వ్యాపారం

పేడతో ఆకృతులు చేస్తున్న మహిళలు

ఆవు పేడకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఆదాయ వనరుగా మార్చుకుని తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి విగ్రహాలు, మొబైల్​ స్టాండ్లు ఇలా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు కొందరు మహిళలు.

  • Share this:
    ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పంచకం ఔషధాల నెలవు.. ఆవు పాలు తల్లిపాలతో సమానం అంటారు.. ఇక గ్రామాలలో ఆవు పేడను పిడకలుగా తయారు చేస్తారు. పొయ్యిలో వంటలకు, ఇటుక తయారీ బట్టీలో మండించడానికి ఇలా రకరాలుగా ఉపయోగిస్తారు. ఇక ఇంట్లో పాడి ఉన్న ఇల్లాలికి చేతి నిండా పనే.. చేతి నిండా డబ్బులే.. పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటారు గ్రామీణ మహిళలు. అయితే ఇప్పుడు ఆవు పేడకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఆదాయ వనరుగా మార్చుకుని తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి విగ్రహాలు, మొబైల్​ స్టాండ్లు ఇలా రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు కొందరు మహిళలు. ఎక్కడంటారా.. చత్తీస్​గఢ్​లో.. అక్కడి మహిళలు ఆవు పేడను ఉపయోగించి లక్షలు గడిస్తున్నారు. మొదట వారి బిజినెస్​ చూసి నవ్వుకున్న జనం ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా మహిళలు.. ఎప్పటినుంచి ఆ వ్యాపారం చేస్తున్నారు.. ఓ లుక్కేద్దాం..

    ఆవు పేడే లక్షీదేవీ కటాక్షం అని..

    ఛత్తీస్‌‌గఢ్‌లో ‘గోధన్ న్యయ్ యోజన’ అనే పథకం ఉంది. పాడి రైతుల నుంచి ఆవు పేడను కిలోకు రూ. 2 చొప్పున కొనుగోలు చేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్‌ లతో పాటు మరికొన్ని ఎన్నో గ్రామాల్లోని ఆడవారికి ఆవు పేడ ఆదాయ వనరుగా మారింది. ఈ గ్రామాలోని మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఆవుపేడతో పిడకలే కాకుండా విగ్రహాలు, మొబైల్‌ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్‌ వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిని మార్కెట్ చేసి చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆవు పేడతో చేసిన ఉత్పత్తులను ఈ కామర్స్ ద్వారా మార్కెట్ చేయడంతో అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లారు. దీంతో రోజు రోజుకీ అమ్మలు పెరిగాయి. ఈ వస్తువుల అమ్మకంగా ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు మహిళలు చేస్తున్న ఈ వ్యాపారాన్ని ఎగతాళి చేసేవారు సైతం ఇప్పుడు ఆవు పేడే లక్ష్మీదేవి అని అంటున్నారు.

    మహిళా స్వయం సహాయక బృందాలే..

    ఇప్పటి వరకు మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన రూ. 1.5 కోట్ల విలువైన 53,000 క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్ అమ్ముడయ్యాయి. ఇంతకుముందు, ఎరువును పశువుల కొట్టాలలో మాత్రమే విక్రయించేవారు.. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎరువుకు డిమాండ్ పెరగడంతో అమెజాన్ వంటి ప్లాట్‌ఫాంలలో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. దీంతో ఆవు పేడ వ్యాపారాన్ని అధ్యయనం చేయడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ వంటి ఎన్నో రాష్ట్రాల నుంచి మహిళలు ఎంతోమంది బృందాలుగా ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాకు వస్తుంటారు. ఆయా గ్రామాల్లోని మహిళల నుంచి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటారు. అధికారులు కూడా ఆవు పేడ వ్యాపారం గురించి ఆరా తీయడానికి వస్తుంటారు. ఇప్పుడిప్పుడే ఆవు పేడతో వ్యాపారం విషయం తెలిసి మరిన్ని రాష్ట్రాల్లోని మహిళలు తమ మెదడకు పదును పెడుతున్నారు. ఛత్తీస్​గడ్ మహిళల బాటలోనే పంజాబ్ లోని పలు గ్రామాల్లో మహిళలు ఆవు పేడతో బిజినెస్ మొదలు పెట్టారు. గతంలో ఆవు పేడను పడేసేవారు కాస్తా ఇప్పుడు మాత్రం ఆవు పేడను బంగారంతో సమానంగా చూసుకుంటున్నారు. 10 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ఎన్నో మహిళా బృందాలు పయనిస్తున్నాయి. ఆవుపేడను ఆదాయ వనరుగా మార్చుకుని ఆర్ధికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతున్నారు.

    కేవీఐసీ తయారీ యూనిట్​..

    భారతదేశంలోని ఆవు పెంపకందారులకు శుభవార్త ఉంది. ఆవుల పెంపకం ద్వారా జీవించేవారు. ఇప్పుడు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఆవు పేడ నుంచి సహజ పేయింట్ తయారుచేసే ప్రాజెక్ట్ నుండి కూడా సంపాదించవచ్చు. ఆవు పేడ నుండి సహజ పెంట్ తయారు చేయడానికి భారతదేశంలోని గ్రామాల్లో కేవీఐసీ (KVIC) తయారీ యూనిట్ విడుదల చేస్తున్నారు. పర్యావరణ అనుకూలమైన ఆవు పేడతో తయారైన సహజ పెంట్ దేశవ్యాప్తంగా బాగా నచ్చుతోంది. ప్రజలు తమ ఇళ్లు, ఆవరణలను స్మెర్ చేయడానికి లేదా పెయింట్ చేయడానికి డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల దీనిని కేంద్ర ప్రభుత్వ ఉపాధి కల్పన పథకం కింద చేర్చారు. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ప్రధాన మంత్రి ఉపాధి ఉత్పత్తి కార్యక్రమం (పీఎమ్‌ఇజీపీ) కింద గ్రామాల్లో ఆవు పేడతో తయారైన 500 పెయింట్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం కేవీఐసీ లక్ష్యంగా పెట్టుకుంది.
    Published by:Prabhakar Vaddi
    First published: