(Syed Rafi, News18,Mahabubnagar)
తల్లిని కావాలని ఎన్నో కలలు కన్న ఆ గర్భిణికి దేవుడు అడగకుండానే వరమిచ్చాడు. ఏడేళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న మహిళకు ఏకంగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు తల్లిని చేశాడు. తల్లితో పాటు బిడ్డలు ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని తెలియడంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నారాయణపేట (Narayanpet) జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఉట్కూరు(Utkoor) మండలంలోని చిన్నపొర్ల(Chinnaporla)గ్రామానికి చెందిన సుజాత (Sujatha)మొదటి కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. సిజేరియన్ (Cesarean)చేసిన వైద్యులు(Doctors) తల్లితో పాటు పుట్టిన ముగ్గురు బిడ్డలను కడుపులోంచి బయటకు తీశారు. ముగ్గురు సంతానం(three children)లో ఇద్దరు అబ్బాయిలు కాగా ఒక ఆడపిల్ల జన్మించినట్లుగా చెప్పారు. ముగ్గురు బిడ్డలతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రసూతి మహిళ సుజాత గర్భిణిగా ఉన్నప్పుడు స్కానింగ్ చేసిన వైద్యులు గర్భంలో మూడు పిండాలు ఉన్నట్లుగా గుర్తించారు. మహిళపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వైద్య సిబ్బంది నెలలు నిండే కొద్ది ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ వచ్చారు. తొలి కాన్పు అందులో ఏడేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు వైద్యులు. డెలవరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు..
సుజాతకు ఐదు రోజుల క్రితం నొప్పులు రావడం మొదలవడంతో కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఉన్న వైద్య బృందం ఆమెకు శనివారం సిజేరియన్ చేసారు. ముగ్గురు బిడ్డలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని బాలింత సుజాత హెల్త్ కూడా బాగానే ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే సుజాతకు వివాహం జరిగి ఏడేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు గర్భవతి కాలేదు. ఆలస్యంగానైనా గర్భవతి అయినప్పటికి మొదటి కాన్పులోనే ముగ్గురు పిల్లల్ని కనడంతో ఆమెతో పాటు బంధవులు ఆనందంలో మునిగిపోయారు.
ఇద్దరు బాబులు, ఓ పాప..
సహజంగా ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. సహజంగా ఒకరు లేదంటే కవల పిల్లలు పుడతారు. కాని మొదటి కాన్పులోనే ముగ్గురు బిడ్డల్ని కనడం అందరూ ఆరోగ్యంగా పుట్టడంతో డాక్టర్లు గొప్ప విషయంగానే భావిస్తున్నారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉండటంతో పాటు మరో కాన్పు కోసం ఎదురుచూడకుండా ఒకే కాన్పులో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టడం నిజంగా దేవుడు ఇచ్చిన వరంగానే సుజాత కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubnagar, VIRAL NEWS