హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Pregnant Dog Photoshoot: గర్భవతిగా ఉన్న శునకానికి ఫోటోషూట్... ఫోటోలు వైరల్

Pregnant Dog Photoshoot: గర్భవతిగా ఉన్న శునకానికి ఫోటోషూట్... ఫోటోలు వైరల్

Image credits Twitter

Image credits Twitter

Pregnant Dog Photoshoot: మనుషులకేనా ఫోటోషూట్ లు..? మాకొద్దా అంటున్నాయి ఆడ శునకాలు. అవి కూడా ఫోటోలకు ఫోజులిస్తూ వయ్యారాలుపోతున్నాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్న కుక్కలు.. దిగిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

 • News18
 • Last Updated :

  ఈ మధ్య ఫోటోషూట్ అనేది ఒక సాధారణ విషయం. ముఖ్యంగా డిజిటల్ యుగంలో కొత్తగా వచ్చిన కెమెరాలతో ఫోటోగ్రాఫర్లు అద్భుతమైన ఫోటోలను తీస్తున్నారు. ఇక పెళ్లిరోజైనా, పుట్టినరోజైనా, ఇంట్లో ఏ శుభకార్యమైనా ఫోటో షూట్ ఉండాల్సిందే. కొద్దిరోజులుగా గర్భవతులుగా ఉన్న సమయంలో కూడా ఫోటోషూట్ లకు సై అంటున్నారు మహిళలు. అయితే మనుషులకేనా ఫోటోషూట్ లు..? మాకొద్దా అంటున్నాయి ఆడ శునకాలు. అవి కూడా ఫోటోలకు ఫోజులిస్తూ వయ్యారాలుపోతున్నాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్న కుక్కలు.. దిగిన ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

  వివరాల్లోకెళ్తే.. ట్విట్టర్ లో ఒక యూజర్ గర్భం దాల్చి ఉన్న కుక్కకు ఫోటోషూట్ ను చేసిన ఫోటోలను  పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శునకాన్ని అందంగా అలరిండమే కాకుండా.. దాని చుట్టూ మంచి డెకరేషన్ ను ఏర్పాటు చేశారు.  ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కుక్క కాలర్ మీద అందమైన గులాబీ, తెల్ల పువ్వులు ధరించి ఉన్న కుక్క.. మెత్తటి పరుపులో హాయిగా నిద్రపోతున్నది.


  మరో చిత్రంలో ఠీవీగా నిలుచుని చూపరులను కట్టిపడేసింది.  ఈ ఫోటోలను చూసిన తర్వాత చాలా మంది నెటిజన్లు తమ వద్ద ఉన్న కుక్కలతో ఫోటోషూట్ లను పెడుతున్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Dog, Social Media, Trending, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు