ప్రతి ఆడపిల్లా కోరుకునే ముఖ్యమైన వరం అమ్మతనం. తల్లి(Mother) అవ్వాలని, మాతృత్వపు మాధుర్యాన్ని రుచి చూడాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. పండంటి పాపాయికి జన్మనివ్వాలంటే మహిళల శరీరం చాలా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ప్రెగ్నెంట్ (Pregnant) కావాలంటే గుడ్ గట్ బ్యాక్టీరియా (Good Gut Bacteria) కూడా మహిళలు(Females) కలిగి ఉండటం చాలా ముఖ్యమని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. స్త్రీలు గర్భం(Pregnancy) దాల్చడంలో గుడ్ గట్ బ్యాక్టీరియా(Bacteria) కీలక పాత్ర పోషిస్తుందని ఈ లేటెస్ట్ స్టడీ(Latest Study) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనాలు బాక్టీరియాతో సహా మానవ ప్రేగులలో నివసించే సూక్ష్మజీవుల అతిపెద్ద జనాభా అయిన నార్మల్ గట్ మైక్రోబయోటా (Microbiota) మొత్తం ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఎలా కీలకమైనదో చూపించాయి. ఇప్పుడు, ఈ గట్ మైక్రోబయోటా సంతాన సాఫల్యానికి కూడా ఎంత కీలకమో తాజా అధ్యయనం తేల్చింది.
'డిస్టింక్ట్ గట్ అండ్ వైజైనల్ మైక్రోబయోటా ప్రొఫైల్ ఇన్ ఉమెన్ విత్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అండ్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ ఫెర్టిలిటీ’ అనే అధ్యయనం గట్ మైక్రోబయోటా ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. దీనిని ఇటీవల BMC ఉమెన్స్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనాన్ని ఆనంద్-బేస్డ్ ఆకాంక్ష హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AHRI)కి చెందిన డాక్టర్ నయన పటేల్, డాక్టర్ భవిన్ పరేఖ్, గాంధీనగర్‌కు చెందిన గుజరాత్ బయోటెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ (GBRC)కి చెందిన ప్రొఫెసర్ చైతన్య జోషి, డాక్టర్ నిధి పటేల్ తదితరులు రచించారు.
తేలికగా గర్భం దాల్చిన స్త్రీలు, అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న మహిళలు.. అలానే పదేపదే ఇంప్లాంటేషన్ వైఫల్యానికి గురైన వారిలో బ్యాక్టీరియా కంపోజిషన్ ని పోల్చిన ఈ స్టడీ కొన్ని విషయాలను గమనించింది. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారిలో యాక్టినోబాక్టీరియా గ్రూప్ (Actinobacteria Group), బిఫిడోబాక్టీరియా (Bifidobacteria) వంటి 'గుడ్ బ్యాక్టీరియా' తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం సూచించింది. మరోవైపు, గర్భం దాల్చగల మహిళలతో పోలిస్తే ఈ మహిళల గట్‌లో హంగేటెల్లా వంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.
ఈ స్టడీ వెజైనల్ బ్యాక్టీరియాను కూడా పరిగణనలోకి తీసుకుంది. కానీ దీని గాఢత (Concentration) గట్ కంటే తక్కువ వైవిధ్యమైనది కాబట్టి ఇది సంతాన సాఫల్యంలో ప్రధాన పాత్ర పోషించలేదని స్టడీ తెలిపింది. ఐవీఎఫ్ (IVF)తో సహా ఇన్‌ఫెర్టిలిటీ చికిత్స వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని అడిగితే ఇన్‌ఫెర్టిలిటీ మెడిసిన్ సైంటిస్ట్ డాక్టర్ పరేఖ్ మాట్లాడుతూ, గట్‌లో నివసించే సూక్ష్మజీవుల సంఖ్య మానవ శరీరంలోని కణాల సంఖ్య కంటే చాలా ఎక్కువ అని అన్నారు. ఇన్‌ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ కష్టంతో కూడుకున్నదని అన్నారు. "గట్ మైక్రోబయోటా మన రోగనిరోధక వ్యవస్థను మేనేజ్ చేస్తుంది. విజయవంతమైన గర్భధారణకు ముఖ్యమైన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లను నియంత్రిస్తుంది,” అని డాక్టర్ పరేఖ్ చెప్పారు.
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే కొంతమంది మహిళల్లో మూడు నుంచి నాలుగు చక్రాలు విఫలమవుతున్నాయని.. దీనికి కారణమేంటనే ఆలోచనతోనే ఈ అధ్యయనం చేపట్టామని డాక్టర్ నైన పటేల్ చెప్పారు. "సమస్య పరిధిని చూస్తే, ఈ రోజు భారతదేశంలో ప్రతి ఆరు జంటలలో ఒకరు సంతానం పొందడంలో ఇబ్బంది పడుతున్నారు" అని ఆమె చెప్పారు. "ఈ అధ్యయనం సంతాన వైఫల్యానికి కారణం ఏంటో పరిశీలించడానికి కనీసం ఒక మార్గాన్నైనా అందిస్తుంది.
ఐవీఎఫ్ వంటి చికిత్సలు పాత్రను పోషిస్తాయి కానీ మహిళల మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేసేటప్పుడు గట్ ఆరోగ్యం వంటి ఇతర అంశాలు కూడా పరిగణించడం కీలకం అని ఈ స్టడీ స్పష్టం చేసింది." అని డాక్టర్ నైనా పటేల్ పేర్కొన్నారు. మహిళల్లో గట్ మైక్రోబయోటా ఆరోగ్యానికి సహజ ప్రోబయోటిక్స్, ఇతర మందులతో చికిత్స చేసి రిజల్ట్స్ చూడటానికి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేశామని ఆమె వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Infertility, Medical study, Pregnancy