Viral Video : మెట్రో ట్రైన్‌లో మూర్ఛపోయిన కరోనా రోగి.. జైల్లో వేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..

Photo Credit : You Tube

Viral Video : కొంత సమయం తర్వాత ఉన్నట్టుండి కిందపడిపోయాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఏమైందో ఏమో అని కంగారుపడ్డ కొందరు ప్రయాణికులు అతడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అతని కరోనా వైరస్ ఉందని గట్టిగా అరిచాడు.

  • Share this:
పిచ్చి వేషాలు వేస్తూ ప్రాంక్ చేశామంటూ జనాల్ని వెర్రి వాళ్ళని చేయడం కొందరికి బాగా అలవాటు అయింది. మొన్నీమధ్య హైదరాబాద్‌లో ఓ యూట్యూబర్‌ ప్రాంక్ చేస్తూ షాపు యజమానితో తన్నించుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదంతం మరవకముందే అచ్చం అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. రష్యా రాజధాని మాస్కోలో జాబోరోవ్ అనే ఓ వ్యక్తి.. ఒళ్ళు గగుర్పొడిచేలా ప్రాంక్ చేశాడు. మెట్రో ట్రైన్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన జాబోరోవ్.. కరోనా వల్ల మూర్ఛ వచ్చినట్లు ఆస్కార్ విన్నింగ్ లెవల్‌లో నటించాడు. ఈ విషయం తెలుసుకున్న రష్యన్ పోలీసులు సదరు ప్రాంక్‌స్టర్‌ను కటకటాల వెనక్కి నెట్టారు.వివరంగా తెలుసుకుంటే.. రష్యాకు చెందిన కరోమటులో జాబోరోవ్ అనే ఒక యువకుడు ప్రాంక్ చేసి జనాల్ని భయపెట్టాలి అనుకున్నాడు. ఇందుకు, మాస్కోలోని ఒక మెట్రో ట్రైన్ ఎంచుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం 2020 ఫిబ్రవరి నెలలో జనంతో కిటకిటలాడుతున్న మెట్రో ట్రైన్ ఎక్కాడు. కొంత సమయం తర్వాత ఉన్నట్టుండి కిందపడిపోయాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఏమైందో ఏమో అని కంగారుపడ్డ కొందరు ప్రయాణికులు అతడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి అతని కరోనా వైరస్ ఉందని గట్టిగా అరిచాడు. మరోవైపు కిందపడిపోయిన జాబోరోవ్ మూర్ఛ(ఫిట్స్) వచ్చినట్లు గిలగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు. ఈ దృశ్యాలను కళ్లారా చూసి తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. తరువాత చెరో దిక్కుకు పరిగెత్తారు.

అయితే ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో విస్తృతంగా వైరల్ అయింది. చివరికి రష్యా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. పోకిరి చేష్టలు చేసి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడన్న ఆరోపణలతో అతడిని నిర్బంధించారు. అంతేకాదు, క్రిమినల్ కోడ్ 213లోని పార్ట్ 2 కింద కేసు నమోదు చేశారు. తాజాగా తన కేసు కోర్టులో విచారణకు వచ్చింది. జాబోరోవ్ చర్యలను సీరియస్‌గా పరిగణించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి : Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి.. పట్టుకోలేక అవస్థలు పడ్డ సిబ్బంది..

పోలీసుల దర్యాప్తులో అతడితో పాటు మరో ఇద్దరు ప్రాంక్ చేశారని తేలింది. ఒక వ్యక్తి వీడియో తీశాడని.. మరొక వ్యక్తి ట్రైన్‌లో కరోనా అంటూ గట్టిగా అరిచాడని పోలీసులు తెలుసుకున్నారు. సంఘటన తర్వాత వీరిద్దరూ పరారీలో ఉన్నారు. వీరికి కూడా రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
Published by:Sridhar Reddy
First published: