• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • PRANAB MUKHERJEES LOVE YOUR NEIGHBOUR LESSON TO ANDHRA PRADESH AND TELANGANA NK

Pranab Mukherjee: పొరుగువారిని ప్రేమించండి... తెలుగు రాష్ట్రాలకు ప్రణబ్ పాఠం

Pranab Mukherjee: పొరుగువారిని ప్రేమించండి... తెలుగు రాష్ట్రాలకు ప్రణబ్ పాఠం

పొరుగువారిని ప్రేమించండి... తెలుగు రాష్ట్రాలకు ప్రణబ్ పాఠం

Pranab Mukherjee's Lesson: రాజకీయాలకు రాకముందు... టీచర్‌గా చేసిన ప్రణబ్ ముఖర్జీ... తెలుగు రాష్ట్రాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే చక్కటి పాఠం చెప్పారు. అదేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Pranab Mukherjee's Lesson: అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య పాత్ర పోషించిన విషయం. రక్షణ రంగ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో... 2006లో యూపీఏ ప్రభుత్వం... తెలంగాణ రాష్ట్ర విభజన అంశంపై ఓ సబ్ కమిటీని వేసింది. ఆ కమిటీలోని ముగ్గురు సభ్యుల్లో ప్రణబ్ ఒకరు. 2014లో రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ... ఏపీ రాష్ట్ర విభజన బిల్లుకి ఆమోదం తెలిపి... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. కమిటీ సభ్యుడిగా ప్రణబ్ ముఖర్జీ... వేర్వేరు రంగాల ప్రజలు, నేతలు, విద్యార్థులను సంప్రదించారు. ఆ సమయంలో ఓవైపు రాష్ట్ర విభజనకు డిమాండ్, మరోవైపు సమైక్య రాష్ట్రంగానే ఉంచాలనే డిమాండ్లు సరి సమానంగా వినిపించాయి. ఐతే... తన పుస్తకంలో... దాదా... తెలంగాణ ఉద్యమం గురించి రాశారు. అలాగే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కమిట్‌మెంట్ గురించి కూడా ప్రస్తావించారు.

    "ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లో న్యాయం ఉంది. ఆ విషయమై నాకు ప్రయోజనకరమైన సలహాలు ఇచ్చారు. చాలా కొద్ది మంది నేతలకు మాత్రమే ఇలాంటి ఉద్యమాల్ని నడిపించే అవకాశం దక్కుతుంది. అలాగే దాన్ని సాకారం చేసుకునే ఛాన్స్ వస్తుందని ప్రణబ్ చెప్పారు. ఆ సందర్భంగా నన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అరుదైన అవకాశం నాకు దక్కిందని ప్రణబ్ అన్నారు" అని తెలంగాణ సీఎం కేసీఆర్... ప్రణబ్‌కి సంతాపం తెలుపుతూ గుర్తుచేసుకున్నారు.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన కొన్ని నెలల తర్వాత... రెండు రాష్ట్రాల సీఎంలూ తలపడ్డారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్... ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో ఓటుకు నోటు ఎపిసోడ్‌ పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల్ని ప్రభావితం చేసి తమ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చంద్రబాబు యత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు.

    ఈ వివాదం ఓ రేంజ్‌లో సాగుతున్నప్పుడు... ప్రణబ్ ముఖర్జీ... హైదరాబాద్... బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఉన్నారు. రెండు రాష్ట్రాలూ శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. రెండు రాష్ట్రాలూ ఇరుగు పొరుగు రాష్ట్రాల్లా కాకుండా... స్నేహితుల్లా ఉండాలని కోరారు.

    ఏసూ ప్రభు టెన్ కమాండ్‌మెంట్స్‌లోని... లవ్ యువర్ నైబర్ (పొరుగువారిని ప్రేమించండి)ని ప్రస్తావించిన ప్రణబ్... "మన పొరుగువారు మన పొరుగునే ఉంటారు. మనం వాళ్లను ఇష్టపడినా, పడకపోయినా వాళ్లు అక్కడే ఉంటారు. మనం వాళ్లతో శాంతియుతంగా ఉండాలా, టెన్షన్లతో ఉండాలా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. చాయిస్ మనదే. పొరుగువారితో సత్సంబంధాలు ముందుకు తీసుకెళ్తాయి" అని రెండు రాష్ట్రాల సీఎంలకూ చెప్పారు.

    రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక కేసీఆర్, చంద్రబాబు (మాజీ సీఎం), వైఎస్ జగన్ రెండు రాష్ట్రాలకూ సీఎంలుగా ఉన్నారు. ప్రణబ్ చెప్పిన ఆనాటి లెసన్ ఇప్పటికీ రెండు రాష్ట్రాలనూ ముందుకు తీసుకెళ్తోంది.
    Published by:Krishna Kumar N
    First published: