కృషి, పట్టుదల ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని నిరూపించిన ...ప్రకాష్ పటేల్

గుర్రాలు కొనేవారు అమ్మేవారు ప్రకాషం పటేల్ సలహా తీసుకుంటారు..

ఇంటి వద్ద గుర్రాల పోషణ చేస్తూ వాటిని విక్రయించిలాభాలను గడిస్తూ అదే రంగంలో రాణిస్తూవాటిపైనే ప్రయాణం చేస్తున్న ప్రకాష్ పటేల్ స్ఫూర్తి పై ప్రత్యేక కథనం..

 • Share this:
  ఒక్కొక్కరికి ఒక్కో ఆలావాటు... ఏదో రంగంలో రాణించాలని తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కొందరు విజయం సాదిస్తే మరికొందరు పరాజయం పాలవుతారు.. కృషి, పట్టుదల ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని నిరూపిస్తున్నాడు.. తనలో ఉన్న కళ తనతోనే అంతం కాకుండా వంశపరంపర రాణించాలనికలలు కంటున్నాడు.. పిల్లలకు సైతం గుర్రం స్వారీలో తర్పీదు ఇస్తున్నాడు.. ఇంటి వద్ద గుర్రాల పోషణ చేస్తూ వాటిని విక్రయించిలాభాలను గడిస్తూ అదే రంగంలో రాణిస్తూవాటిపైనే ప్రయాణం చేస్తూన్నా ప్రకాష్ పటేల్ స్ఫూర్తి పై ప్రత్యేక కథనం..

  నిజామాబాద్ జిల్లామహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు ఆనుకుని ఉంది.. జిల్లా సరిహద్దు మండలంలో మూడు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు కనిపిస్తాయి.. రాజుల కాలంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లంటే గుర్రాలపై ప్రయాణం చేసేవారు.. సరిహద్దు మారుములా ప్రాంతం కావడంతో అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది.. ప్రస్థూతం ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుంది.. అయినా అలనాటి గుర్రాల స్వారీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.. మహారాష్ట్రలో జరిగే గుర్రపుస్వారీ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలుస్తున్నారు.. ఇంతటి నైపుణ్యం కలిగిన వ్యక్తి ప్రకాశం పటేల్.. జంతువులంటే ఆయనకు ప్రాణం నలభై సంవత్సరాల క్రితం తండ్రితో కలిసి గుర్రాల సంతాకు వెళ్లాడు.. ఆ సంతాల్లో 5వందల రూపాయలకు గుర్రాన్ని కొనుగోలు చేశాడు.. ఇది చూసిన తండ్రి నీకు ఎమీతెలుసాని అతన్ని మందలించాడు.. కానీ ఆయనలో ఉన్న ఉత్సాహాన్ని మాత్రం నిలువరించలేకపోయాడు.. కోటగిరి మండలంలోని హంగర్గా గ్రామానికి చెందిన ప్రకాశం పటేల్ గుర్రాలపై స్వారీ చేస్తూ అందులో మంచి నైపుణ్యాన్ని సాధించారు. మరొకరికి శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగాడు.... అది ఓ చిన్న పల్లెటూరు.. పట్టణ ప్రాంతానికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం.. గుర్రాలు ఉన్నవారు మాత్రం అశ్వాల పై పట్టణానికి వెళ్లి పనులు చేసుకుని వచ్చేవారు.. ఇలా అనేక మందికి గుర్రాలు ఉండేవి.. రానురాను గుర్రాల పోషణ భారమై కనుమరుగయ్యాయి.. ఇంధనంతో నడిచే వాహనాలను కొనుగోలు చేసి వాటిపై మోజు పెంచుకుంటూన్నారు.. కానీ ప్రకాశం పటేల్ మాత్రం గుర్రాలను పెంపకం మానలేదు.. అతని తండ్రి యశ్వంత్ పటేల్ తో కలిసి గుర్రాలను అమ్మడానికి మహా రాష్ట్రలోని జాతరకు వెళ్లి వచ్చేవాడు.. దీంతో గుర్రాల వ్యాపారంపై మోజు పెంచుకున్నాడు. మహారాష్ట్రలో మాలిక గ్రామంలో గుర్రాల రేసు పెట్టడంతో ఆ పోటీల్లో మొదటి స్థానంలో సాదించాడు.. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర వాసులు హంగర్గాకు వచ్చి ప్రకాష్ పటేల్ అభినందించారు.. తన వద్ద ఉన్న నైపుణ్యంతో తన కొడుక్కి, తన మనవరాలికి, మనవడికి కూడా గుర్రాల సారి చేయడంలో తర్ఫీదు ఇచ్చాడు.. ఈ గుర్రం వ్యాపారంలో ప్రకాష్ పటేల్ కు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మంచి పరిచయాలున్నాయి..
  పశుగ్రాసం, శనగ, కంది, పెసరి పొట్టుతో సమానంగా పచ్చిమేతను తమ పొలాల్లో పెంచి ఆ గుర్రాలకు పశుగ్రాసం ఎక్కువ తక్కువ కాకుండా షార్క్ కట్టర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలని ప్రకాషం పాటిల్ వివరించారు.. గుర్రాలకు మాస్కూలు తొడిగిబుట్టల్లో చిన్న చిన్న ముక్కలు చేసిన పశుగ్రాసాన్ని వేస్తూ తినిపిస్తామన్నారు.. తర ఇంట్లో తరతరాలుగా సంప్రదాయబద్దంగా గుర్రాలు పెంచుతూ వస్తున్నామన్నారు. ఇంటి ముందు నాలుగైదు గుర్రాలు ఉంటేనే ఆనందంగా ఉంటుందన్నారు.. గుర్రాలు కొనేవారు అమ్మేవారు ప్రకాషం పటేల్ సలహా తీసుకుంటారు.. గ్రామా సర్పంచ్ గా, ఎంపీటీసీగా ప్రజాలకు సేవలందించారు. అలాగే ప్రకాష్ పటేల్ తమ్ముడు విజయ్ పటేల్ సహకార సంఘం అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. విజయ్ పటేల్ డైరెక్టర్ గా, సునీత పార్టీ గ్రామ సర్పంచ్ గా ఉన్నారు.

  పి.మహేందర్, న్యూస్18 తెలుగు, ప్రతినిధి..
  Published by:Venu Gopal
  First published: