రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపనున్న కేంద్రం... చెక్ చేయండిలా

Pradhan Mantri Kisan Samman Nidhi Scheme | పీఎం కిసాన్ లబ్ధిదారులకు 6వ విడత డబ్బుల్ని జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేయాలో, తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 10, 2020, 12:48 PM IST
రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపనున్న కేంద్రం... చెక్ చేయండిలా
రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపనున్న కేంద్రం... చెక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు శుభవార్త. ఈ పథకంలో భాగంగా 10 కోట్ల మంది రైతుల అకౌంట్లోకి ఆరో విడత డబ్బుల్ని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సరిగ్గా 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 1 నుంచి రైతుల అకౌంట్లోకి రూ.2,000 జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అప్లై చేయనివారు ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందొచ్చు. ఇక ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారంతా స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రూ.74,000 కోట్లు జమ చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఆరో విడత డబ్బుల్ని జమ చేయనుంది. డబ్బులు జమ అయిన తర్వాత లబ్ధిదారుల జాబితా చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి.

Farmers corner సెక్షన్‌లో Beneficiary Status క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ఆధార్ నెంబర్ / బ్యాంక్ అకౌంట్ నెంబర్ / మొబైల్ నెంబర్ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోండి.
నెంబర్ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయండి.
మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో, అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయో లేదో స్టేటస్ తెలుస్తుంది.

Covid 19: కరోనా వైరస్‌ కవరేజీ కోసం నేటి నుంచి కొత్త పాలసీలు... బెనిఫిట్స్ ఇవేSBI: ఈ బ్యాంకింగ్ సేవలకు మిస్డ్ కాల్‌, ఎస్ఎంఎస్ చాలు

ఇప్పటికే దరఖాస్తు చేసిన లబ్ధిదారులు ఓసారి వివరాలు సరిచూసుకోవాలి. వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే అకౌంట్‌లో డబ్బులు జమ కావడంలో సమస్యలు రావొచ్చు. గతంలో చిన్నచిన్న తప్పుల వల్ల లబ్ధిదారుల అకౌంట్‌లోకి డబ్బులు జమ కాలేదు. లబ్ధిదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉండటం లాంటి సమస్యల వల్ల మనీ ట్రాన్స్‌ఫర్‌లో సమస్యలు వచ్చాయి. పేర్లు తప్పుగా ఉంటే సరిదిద్దుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి.
ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి.
వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి.
ఇంకా ఏవైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి చెందిన టోల్‌ఫ్రీ, హెల్ప్‌లైన్ నెంబర్లను సంప్రదించొచ్చు. సంప్రదించాల్సిన నెంబర్స్ ఇవే.

పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109
పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266
పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401
పీఎం కిసాన్ ఇమెయిల్ ఐడీ: pmkisan- ict@gov.in
Published by: Santhosh Kumar S
First published: July 10, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading