పలు అంశాలపై కోర్టు కేసులు నడుస్తుంటాయి. జరిమానాలు, ఆస్తులకు సంబంధించిన కోర్టు కేసులను పరిశీలిస్తే.. వాటి విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటికి సంబంధించి కోర్టులో కేసులు(Court Cases) నడుస్తుంటాయి. అయితే కేవలం రూ. 4,500 జరిమానా చెల్లించేందుకు అంగీకరించని కోసం ఓ ప్రభుత్వ శాఖ ఏడేళ్లుగా ఈ కేసును నాన్చడం కోర్టుకు సైతం అసహనం వచ్చేలా చేసింది. యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో తపాలా శాఖ(Postal Department) 7 సంవత్సరాలుగా రూ. 4,500 పరిహారంపై కేసుపై పోరాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కేంద్ర పోస్టల్ శాఖను మందలించింది. తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ పిటిషన్‌ను జస్టిస్ వివేక్ చౌదరి సింగిల్ బెంచ్ తిరస్కరించింది.
వాస్తవానికి 2014లో మొరాదాబాద్ లోక్ అదాలత్ లో పోస్టల్ శాఖకు రూ.4,500 జరిమానా విధించారు. అందిన సమాచారం మేరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన పాస్ పోర్టు, డిమాండ్ డ్రాఫ్ట్ పోయినందుకు పోస్టల్ శాఖకు జరిమానా విధించారు. మొరాదాబాద్‌లోని శాశ్వత లోక్ అదాలత్ 30 సెప్టెంబర్ 2014న ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు లోక్ అదాలత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తపాలా శాఖ బాధితురాలికి పరిహారం ఇవ్వడానికి బదులుగా అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది.
తపాలా శాఖ 2015లో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ గత 7 సంవత్సరాలుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. విచారణ పూర్తయిన తర్వాత జస్టిస్ వివేక్ చౌదరి సింగిల్ బెంచ్ నవంబర్ 16న ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విషయమై తపాలా శాఖ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడమే కాకుండా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Trending News: ఓరినీ.. అది కూడా తప్పేనా ?.. ఎవరైనా ఈ విషయంపై పోలీస్ కేసు పెడతారా ?
Viral video : ఏనుగును రెచ్చగొట్టారు.. ఫలితం ఏమైందో వీడియో చూడండి
లోక్ అదాలత్ నిర్ణయాన్ని గౌరవించే బదులు, కేంద్ర ప్రభుత్వ ముఖ్యమైన శాఖ దానిని చట్టపరమైన చిక్కులలో చిక్కుకుందని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. నాలుగున్నర వేల రూపాయలు చెల్లించడానికి బదులు, కోర్టు పోరాటంలో చాలా రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేశారు. పోస్టల్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఏది ఏమైనప్పటికీ, రూ.25000 కంటే తక్కువ చెల్లించిన సందర్భంలో రెండవ అప్పీలును దాఖలు చేయలేరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian postal, Trending