బ్యాడ్ న్యూస్.. దేశంలో గ్యాస్ సిలిండర్ కొరత.. కారణం ఇదీ..

దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతోందా? పండుగ పూట ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? అంటే తాజా పరిణమాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ లభ్యం కావడం లేదని సమాచారం.

news18-telugu
Updated: September 27, 2019, 2:17 PM IST
బ్యాడ్ న్యూస్.. దేశంలో గ్యాస్ సిలిండర్ కొరత.. కారణం ఇదీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతోందా? పండుగ పూట ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందా? అంటే తాజా పరిణమాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ లభ్యం కావడం లేదని సమాచారం. బుక్ చేసుకున్న 15 రోజుల వరకు సిలిండర్ అందడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా తదితర రాష్ట్రాల్లో ఎల్పీజీ కొరత ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో అక్టోబరు 21 నుంచి అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఎల్పీజీ కొరత ఏర్పడటం అధికార బీజేపీ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో, మరో రెండు కార్గోలు అదనంగా పంపాలని కేంద్ర ప్రభుత్వం అబుదాబి నేషల్ ఆయిల్ కంపెనీకి లేఖ రాసింది. అయితే, అవి భారత్‌కు చేరడానికి 10 రోజుల సమయం పడుతుంది.

ఎల్పీజీ కొరత ఏర్పడటానికి కారణం ఏంటంటే.. సౌదీలో ఆయిల్ బావులపై డ్రోన్ దాడులే. ప్రతి నెలా భారత్ సౌదీ నుంచి 2లక్షల టన్నుల ఎల్పీజీని కొలుగోలు చేస్తోంది. అయితే, సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులు చేశారు. ఆ డ్రోన్ దాడిలో అబక్ అండ్ ఖురాయిస్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో ఆ కంపెనీ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించింది. దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేశాకే ఉత్పత్తిని పెంచుతామని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం కొరత ఏర్పడింది.

కాగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై సౌదీ ఆయిల్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌ను సంప్రదించగా ఆయన వీలైనంత త్వరగా ఉత్పత్తిని పునరుద్ధరించి, సరఫరా చేస్తామని తెలిపారు. అయితే.. ప్రస్తుత తరుణంలో గ్యాస్ కోసం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...