రూ.10లక్షల జరిమానా... కట్టనందుకు రూ.2కోట్ల కారు సీజ్...

రూ.2కోట్ల ఖరీదైన పోర్షే స్పోర్ట్స్ కారుకు ట్రాఫిక్ పోలీసులు దాదాపు రూ.10లక్షల జరిమానా విధించారు.

news18-telugu
Updated: November 30, 2019, 8:46 PM IST
రూ.10లక్షల జరిమానా... కట్టనందుకు రూ.2కోట్ల కారు సీజ్...
రూ.9.80లక్షలు ఫైన్ పడిన కారు
  • Share this:
రూ.2కోట్ల ఖరీదైన పోర్షే స్పోర్ట్స్ కారుకు ట్రాఫిక్ పోలీసులు దాదాపు రూ.10లక్షల జరిమానా విధించారు. గుజరాత్‌లో ఈ ఘటన జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రోడ్డు మీద వెళ్తున్న ఖరీదైన పోర్షే 911 మోడల్ స్పోర్ట్స్ కారును పోలీసులు ఆపారు. సిల్వర్ కలర్‌లో ధగధగా మెరిసిపోతున్న ఆ కారుకి నెంబర్ ప్లేట్ లేదు. ఎలాంటి లీగల్ పేపర్లు లేవు. పేపర్లకు సంబంధించి డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించారు. అతడి వద్ద కారుకి సంబంధించి ఎలాంటి పేపర్లు లేవు. దీంతోపాటు నెంబర్ ప్లేట్ కూడా లేదు. దీంతో పోలీసులు అతడికి కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఏయే నిబంధనలు ఉల్లంఘించాడో తెలుసుకుని.. అన్నిటికీ కలిపి వాత పెట్టారు. మొత్తం రూ.9.80లక్షలు జరిమానా కట్టాలని ఆదేశించారు. అయితే, ఆ మొత్తాన్ని ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెల్లించి.. ఆ రశీదు తీసుకుని వస్తే కారు ఇస్తామని చెప్పి ఆ కారుని సీజ్ చేశారు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>