ఇది అన్యాయం...ఇన్‌స్టాగ్రామ్‌పై మండిపడుతున్న పోర్న్ స్టార్స్

Pornstars vs Instagram | పోర్న్ స్టార్లకు, ఇన్‌స్టాగ్రామ్ మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మనేలా ఉంది వ్యవహారం. ఇన్‌స్టాగ్రామ్ వ్యవహార శైలితో పోర్న్ స్టార్లతో పాటు, సెక్స్ వర్కర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. తమపై ఎందుకంత వివక్ష అంటూ ఆ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌పై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 6:32 PM IST
ఇది అన్యాయం...ఇన్‌స్టాగ్రామ్‌పై మండిపడుతున్న పోర్న్ స్టార్స్
అలనా ఇవాన్స్, జెస్సికా జేమ్స్, లీసా డేనియల్స్,
news18-telugu
Updated: October 19, 2019, 6:32 PM IST
పోర్న్ స్టార్లకు, ఇన్‌స్టాగ్రామ్ మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మనేలా ఉంది వ్యవహారం. ఇన్‌స్టాగ్రామ్ వ్యవహార శైలితో పోర్న్ స్టార్లతో పాటు, సెక్స్ వర్కర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. తమపై ఎందుకంత వివక్ష అంటూ ఆ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌పై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఏంటంటే.. వారి అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ తొలగిస్తుండటమే. గైడ్‌లైన్స్, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వారి ఖాతాలను బ్లాక్ చేస్తోంది. దీంతో తమపై ఇన్‌స్టాగ్రామ్ కక్ష కట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా సైట్లలో సెక్స్ రిటేటెడ్ కంటెంట్ ఉంటే సెన్సార్ చేస్తారు. రెచ్చగొట్టే ఫోటోలు ఉన్నా, అభ్యంతరకర సన్నివేశాలను పోస్ట్ చేసినా వాటిని గుర్తించి బ్లాక్ చేస్తారు. అయితే, తమవి మాత్రమే బ్లాక్ చేస్తున్నారంటూ పోర్న్ స్టార్లు గళమెత్తుతున్నారు. అదే.. సెలబ్రిటీలు ఎంత అభ్యంతరకర పోస్టులు పెట్టినా వారిని ఎందుకు బ్లాక్ చేయరంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే పోర్న్ స్టార్లు అంతా కలిసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తమ సమస్యను వారికి వివరించి అకౌంట్లు బ్లాక్ చేయకుండా చూసుకున్నారు. అయితే, తాజాగా, జెస్సికా జేమ్స్ అనే పోర్న్ స్టార్ మృతి చెందడంతో ఆమె అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. పలువురు నీలిచిత్రాల నటీనటులు దీంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ దాన్ని పునరుద్ధరించారు. అయితే.. ప్రతీ సందర్భంలో ఇలాగే అవుతోందని, మరోసారి ఇలా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అలనా ఇవాన్స్ అనే పోర్న్ స్టార్ డిమాండ్ చేసింది.

తామూ ఈ సమస్య ఎదుర్కొన్నామని వందలాది మంది తనతో చెప్పారని ఆమె వెల్లడించింది. స్పాన్సర్‌షిప్ చేసే సందర్భంలో అకౌంట్‌ను తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని లీసా డేనియల్స్ ప్రశ్నించింది. తీసుకున్న డబ్బులు సదరు కంపెనీకి తిరిగి చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. న్యూడిటీ, సెక్సువల్ యాక్టివిటీ.. తదితరాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిషేధించింది. అయితే, తాము పూర్తిగా న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయకున్నా అకౌంట్ డిలీట్ చేయడం ఏంటని అడిగింది.

ఇక, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్, ఆమె సోదరీమణులు రెచ్చగొట్టే ఫోటోలు, పోస్టులు పెడుతున్నా వారి అకౌంట్లు ఎందుకు తొలగించడం లేదని, తమ అకౌంట్లను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారంటూ పలువురు పోర్న్ స్టార్లు నిలదీస్తున్నారు. దీనిపై పోర్న్ స్టార్ల తరఫున ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను సంప్రదిస్తూ చర్చలు జరుపుతున్నారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...