వీడియో కాన్ఫరెన్స్‌లో షాక్... ఏకంగా పోర్న్ వీడియో ప్రత్యక్షం...

ఉద్యోగులు అందరూ వీడియో కాన్ఫరెన్స్‌లో సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో ఓ శృంగార చిత్రం స్క్రీన్ మీద ప్లే అయింది.

news18-telugu
Updated: April 1, 2020, 6:21 PM IST
వీడియో కాన్ఫరెన్స్‌లో షాక్... ఏకంగా పోర్న్ వీడియో ప్రత్యక్షం...
ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెతో పాటూ ఉన్న బంధువుపై దాడికి దిగారు. ఆ తరువాత వారు ఆమెను బలాత్కరించి, ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని తిజారా డీఎస్పీ కుషాల్ సింగ్ తెలిపారు.
  • Share this:
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ధాటికి లాక్ డౌన్ అయిపోయిన పరిస్థితి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా ప్రజలు కరోనా వైరస్‌కు భయపడి ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఈ క్రమంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చేస్తున్నారు. అయితే, సాధారణంగా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ల సందర్భంగా అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో పిల్లలు లేదా పెద్దవాళ్లు వీడియోలో కనిపించడం, లేకపోతే కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కూడా వచ్చి ఒళ్లో కూర్చోవడం లాంటివన్నమాట. అయితే, ఈసారి అమెరికాలో ఏకంగా స్క్రీన్ మీద ఏకంగా పోర్న్ వీడియో టెలికాస్ట్ అయింది. ఉద్యోగులు అందరూ వీడియో కాన్ఫరెన్స్‌లో సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో ఓ శృంగార చిత్రం స్క్రీన్ మీద ప్లే అయింది. అలాగే, విద్వేషపూరిత ప్రసంగం కూడా కనిపించింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమెరికాలో సహజంగా వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం జూమ్ యాప్‌ను వినియోగిస్తూ ఉంటారు. దీన్ని ఎవరో హ్యాక్ చేసి ఇలా పోర్న్ వీడియోలు ప్రదర్శించినట్టు భావిస్తున్నారు. ఇది ప్రజల ప్రైవసీకి సంబంధించిన అంశమని, అలాంటి వీడియో కాన్ఫరెన్స్‌లో వీడియో ప్రదర్శితం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాలంటూ జూమ్ కంపెనీకి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో కంపెనీలే కాదు. స్కూళ్లు కూడా మూతపడ్డాయి. అందులో కొన్ని స్కూళ్లు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నాయి. ఒకవేళ విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయంలో ఇలాంటివి ఎదురైతే చాలా ఇబ్బంది వస్తుందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 1, 2020, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading