POOJA HEGDE SHOCKING REMUNERATION FOR KOLLYWOOD MOVIE NR
Pooja Hegde: ఒక్క సినిమాకు పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
pooja hegde remuneration
Pooja Hegde: నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సినిమా సినిమాకు అభిమానులను
Pooja Hegde: నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పూజా హెగ్డే మొదటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సినిమా సినిమాకు అభిమానులను పెంచుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ లో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా జులై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. సినిమా మీద సినిమా తీస్తూ ఫార్మ్ లో ఉన్న హీరోయిన్ పూజా. ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ దళపతి పక్కన హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే రెమ్యూనరేషన్ కు సంబంధించి ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. విజయ్ పక్కన నటించేందుకు ఆమె ఏకంగా మూడున్నర కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.
కానీ నిజానికి అది కేవలం ఒక గాసిప్ మాత్రమే అని తేలింది. విజయ్ తో సినిమాకు ఆమె కేవలం మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటున్నట్టు సమాచారం. నిజానికి గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమె రెమ్యూనరేషన్ కేవలం ఒకటైనా కోటి రూపాయిలని, కానీ అప్పుడు ఆమె రెండున్నర కోటి రూపాయలకు పెంచింది. కానీ ఆతర్వాత ఆరునెలలకు పూజా హెగ్డే ఏకంగా 50 లక్షల రూపాయిలు పెంచింది. నిజానికి కొలీవూడ్ లో ఆమె మొదటి సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆమెకు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉండడంతో తమిళ్ డైరెక్టర్లు అంత ఇవ్వడానికి రెడీ అయ్యారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.