అన్ని పాఠశాలల్లో లైంగిక విద్య.. సర్వే తేల్చిన నిజాలివీ..

Sex Education | రట్జర్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు అమెరికాలో ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే.. పోల్‌లో పాల్గొన్న 83 శాతం మంది ఓటర్లు పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని చెప్పారట.

news18-telugu
Updated: October 15, 2019, 3:59 PM IST
అన్ని పాఠశాలల్లో లైంగిక విద్య.. సర్వే తేల్చిన నిజాలివీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ ఎడ్యుకేషన్.. ప్రస్తుత తరుణంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా, ఎవర్ని కదిలించినా.. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు అవసరమా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్యే బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరమని వ్యాఖ్యానించింది. ఆమెతో పాటు చాలామంది నటీనటులు, విద్యావేత్తలు, మేధావులు లైంగిక విద్యపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేప్‌లు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న తరుణంలో సెక్స్ ఎడ్యుకేషన్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా స్కూళ్లలో, ఇంట్లో.. చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. బ్రిటన్‌లోని పలు పాఠశాలల్లో పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పాఠాలు చెప్పేందుకు సిద్ధమయ్యాయి. దాదాపు 240కి పైగా ప్రైమరీ స్కూళ్లలో ‘మీ సెక్స్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో భాగంగా పాఠాలను బోధించనున్నారు.‘టచింగ్ ప్రైవేట్ పార్ట్స్’ (జననాంగాల స్పర్శ) గురించి పిల్లలకు చెప్పనున్నట్లు అక్కడి విద్యాశాఖ స్పష్టం చేసింది. పిల్లల జననాంగాలను అసభ్యంగా తాకడం, వారిని సెక్స్‌కు ప్రేరేపించడం లాంటివి చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని టీచర్లు విద్యార్థులను బోధించనున్నారు.

అయితే, బ్రిటన్‌లోనే కాదు మరిన్ని పాశ్చాత్య దేశాల్లో .. పిల్లలకు సెక్స్ పాఠాలు బోధించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి.. దీనిపై ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనుకున్న రట్జర్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు అమెరికాలో ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే.. పోల్‌లో పాల్గొన్న 83 శాతం మంది ఓటర్లు పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని చెప్పారట. 15 శాతం మంది కొంతవరకు ముఖ్యమేనని, 2 శాతం మంది లైంగిక విద్య అవసరం లేదని వెల్లడించారట. మరో రెండు శాతం మంది తమ అభిప్రాయం చెప్పలేదట.

మాధ్యమిక విద్యను అభ్యసించే సమయంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని 64 శాతం మంది సూచించగా.. 25 శాతం మంది కొంత వరకే బోధించాలని, అసలే బోధించవద్దని 4 శాతం మంది వెల్లడించారట. సర్వేపై మాట్లాడిన రట్జర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లెస్లీ కాంటర్.. టీనేజ్ వయసులో ప్రెగ్నెన్సీని నిరోధించేందుకు, సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ రాకుండా ఉండేందుకు లైంగిక విద్య అవసరమని తమ పోల్‌లో తేలిందని వివరించారు.
First published: October 15, 2019, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading