Home /News /trending /

POLICE VIDEO OF A WOMAN BEATING A YOUNG MAN TO DEATH IN MADHYA PRADESH HAS GONE VIRAL SNR

ఆ లేడీ పోలీస్‌కి ఎంత పొగరు.. ఏం చేసిందో తెలిస్తే షాక్

Photo Credit: Youtube

Photo Credit: Youtube

OMG: చూసుకోకుండా కాలు తగిలినందుకు మధ్యప్రదేశ్‌లో ఓ లేడీ కానిస్టేబుల్‌ యువకుడ్ని నడిరోడ్డుపై చెంప చెళ్లుమనిపించింది. అంతటితో సరిపెట్టుకోక..అతడి కర్చీఫ్‌తో తన ప్యాంట్‌పై అంటుకున్న దుమ్మును తుడిపించింది. మహిళా కానిస్టేబుల్‌ ఓవర్‌ యాక్షన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంకా చదవండి ...
రోడ్డుపై వెళ్లేటప్పుడు, ఏదైనా షాపింగ్‌ చేయడానికి దుకాణాల ముందు వెహికల్స్ పార్క్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా చెప్పాలి.. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో చూడకుండా జరిగిన చిన్న పొరపాటుకు ఓ లేడీ కానిస్టేబుల్‌(Lady constable)ఇచ్చిన పనిష్మెంట్ వీడియో(Video)తెగ వైరల్ (Viral)అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya pradesh) రేవా(Rewa)లో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అమ్హియా పోలీస్‌ స్టేషన్‌ (Ammihya police station)పరిధిలోని సిర్మౌర్ చౌక్‌ (Sirmour chowk)దగ్గర వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఓ స్టేషనరీ షాపు ముందు బైక్‌ పార్క్ చేసి ఉంది. బైకర్‌ తన వాహనాన్ని తీసుకెళ్లే క్రమంలో తన కాలు పక్కనే ఉన్న మహిళకు తగిలింది. అంతే ఆ చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసింది ఆ మహిళ. బైకు తీస్తుండగా కాలు తగిలిందని యువకుడ్ని చెంప చెళ్లుమనిపించింది ఆ మహిళ. అంతటితో వదిలేయకుండా తన ప్యాంట్‌కు అంటుకున్న దుమ్మును తుడవమంటూ అతడి కర్చీఫ్‌(Napkin)తో తుడిపించింది. తెలియక జరిగిన పొరపాటుకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చిన మహిళ ఎవరో కాదు లేడీ కానిస్టేబుల్‌ కావడం విశేషం. ముఖానికి వైట్‌ కలర్‌ స్కార్ఫ్‌a (White scarf color)తో కోటు, ప్యాంట్ వేసుకోవడంతో బైకర్‌ సాధారణ మహిళ భావించాడు. కానీ ఆమె లేడీ కానిస్టేబుల్ అని ఆమె ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో అందరికి అర్ధమైంది. యూనిఫామ్‌( Uniform)లో ఉంటేనే రెచ్చిపోయే పోలీసులు..సివిల్ డ్రెస్సు(Civil dress)లో కూడా ఈ స్థాయిలో రుబాబు చేస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ లేడీ పోలీస్‌కి అంత పొగరెందుకు..
ఇది జరిగింది రేవాలోని ఓ చిన్న మార్కెట్‌ దగ్గరే అయినప్పటికి..లేడీ కానిస్టేబుల్‌ చేసిన రుబాబు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్‌ అయితే మాత్రం అంత దురుసుగా ప్రవర్తించాలా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పోలీసులు తెలిసి చేసినా ఎవరూ శిక్షించరు..అదే సాధారణ పౌరులు చూడకుండా జరిగిన పొరపాటుకు నలుగురిలో పట్టుకొని ఓ మహిళ అతని పరువు తీయవచ్చా అంటూ మధ్యప్రదేశ్‌ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

ఇలా చేయడం వల్లే ..
దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ కొందరు పోలీసులు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. అందువల్లే పోలీసుశాఖపై ప్రజల్లో మంచి అభిప్రాయం తగ్గుతోందనే విమర్శలు వస్తున్నాయి. కనీసం సోషల్ మీడియాలో  ఇలాంటి వీడియోలు చూసినప్పుడైన సదరు అధికారులు కింది స్థాయి ఉద్యోగులను మందలిస్తే డిపార్ట్‌మెంట్‌కి చెడ్డ పేరు వచ్చే అవకాశముండదని సూచిస్తున్నారు నెటిజన్లు.
Published by:Siva Nanduri
First published:

Tags: Madhya pradesh, Police, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు