ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన పోలీసులు.. డీజీపీకి జరిమానా..
రాంగ్ రూట్లో పోలీస్ వాహనం (Photo: Telangana Echallan website)
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. లేకపోతే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.. అంటూ ప్రచారం నిర్వహిస్తున్న పోలీసులే దారి తప్పారు. రాంగ్ రూట్లో వెళ్లి కెమెరాకు అడ్డంగా చిక్కారు. ఈ ఘటన సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడుకోండి.. లేకపోతే భారీగా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.. అంటూ ప్రచారం నిర్వహిస్తున్న పోలీసులే దారి తప్పారు. రాంగ్ రూట్లో వెళ్లి కెమెరాకు అడ్డంగా చిక్కారు. ఈ ఘటన సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు డిపార్ట్మెంట్ వాహనాన్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఆ వాహనాన్ని ఫోటో తీశాడు. క్షణాల్లోనే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రావడంతో అప్రమత్తమై మంగళవారం (ఈ నెల 3న) ఆ వాహనానికి (TS09PA5121) రూ.1135 ఛలానా విధించారు. అయితే, ఆ వాహనం తెలంగాణ డీజీపీ పేరున ఉండటంతో డీజీపీకి ఫైన్ వేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా, కొత్త ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకే వేలకు వేల ఫైన్లు వేస్తే.. పోలీసులకు లక్షల్లో ఫైన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా పోలీసులు ట్రాఫిక్ రూల్స్ తప్పినట్లు కనిపిస్తే చాలు.. కెమెరాతో క్లిక్మనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొత్త నిబంధనల ప్రకారం.. రాంగ్ రూట్లో వెళితే రూ.5వేల వరకు ఫైన్ వేయాలి. అయితే, రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమల్లోకి రాకపోవడంతో రూ.1135 ఛలానా విధించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.