Video : ఒక్క ఆటోలో 24 మంది ప్రయాణికులు... ఆపేసిన పోలీసులు...

సాధారణంగా ఆటోలో ముందు సీట్లో డ్రైవర్, వెనక సీట్లో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఒక్కరు ఎక్కువ ఉన్నా... అది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమే. కానీ మన దేశంలో ఆటోల్లో ఇష్టమొచ్చినట్లు ప్రయాణికుల్ని ఎక్కించేసుకుంటున్నారు. తాజా ఘటన అందుకు పరాకాష్ట.

Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 12:51 PM IST
Video : ఒక్క ఆటోలో 24 మంది ప్రయాణికులు... ఆపేసిన పోలీసులు...
వీడియోలో దృశ్యం (Image : Twitter - CP KARIMNAGAR)
Krishna Kumar N | news18-telugu
Updated: August 12, 2019, 12:51 PM IST
తెలంగాణ... కరీంనగర్ పోలీసులు ఓ ఆటోను చూసి షాకయ్యారు. మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో... ఒకే వాహనంలో 20 మందిని ఎక్కిస్తే... ఈ ఆటోలో ఏకంగా 24 మంది ప్రయాణికులున్నారు. మొదట ఏ 10 మందినో ఎక్కించినట్లు కనిపించినా... ఒక్కొక్కరూ దిగుతుంటే... పోలీసులకే ఆశ్చర్యమేసింది. మొత్త ఎంతమంది అని లెక్కించి... షాకయ్యారు. అసలు అంత మంది ఒక్క ఆటోలో ఎలా పట్టారన్నదే వాళ్లకు అర్థం కాలేదు. వాళ్లందర్నీ ఆటో పక్కన నిలబెట్టి... ఫొటోలు తీశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని... కరీంనగర్ కమిషనర్... ఈ ఆటోకి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆటో డ్రైవర్లు ఆదాయం కోసం ఇష్టమొచ్చినట్లు ప్రయాణికుల్ని ఎక్కించేసుకోవడం సహజంగా జరుగుంతోందన్న పోలీసులు... ప్రయాణికులు తమ సేఫ్టీని ఆలోచించుకోవాలని హెచ్చరించారు.

police, auto, telangana news, telangana updates, road safety, viral video, karimnagar police, తెలంగాణ న్యూస్, తెలంగాణ వార్తలు, పోలీసులు, వైరల్ వీడియో, వైరల్ న్యూస్,
వీడియోలో దృశ్యం (Image : Twitter - CP KARIMNAGAR)


ఈ వీడియో వైరల్ అయ్యింది. దాదాపు 17 వేల మంది దీన్ని చూడగా... 972 మంది లైక్ చేశారు. అలాగే... 381 మంది రీట్వీట్ చేశారు. ఇంత మంది ప్రయాణికుల్ని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ తిమ్మాపూర్‌కి చెందినవాడని పోలీసులు తెలిపారు.




గత వారం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాల్... ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో తిరగబడింది... ఈ దుర్ఘటనలో 12 మంది కార్మికులు చనిపోగా... ఆరుగురు గాయాలపాలయ్యారు.

రాజ్యసభలో మోటార్ వెహికిల్ సవరణ బిల్లును ఆమోదించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. రోడ్ సేఫ్టీపై మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి.
First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...