Viral Video: రోడ్డుపై డ్యాన్స్‌తో ఇరగదీసిన యువతి.. వావ్ అనిపించింది.. ఆ వీడియో ఎంతవరకు వెళ్లిందంటే..

(Image-Instagram)

ఇటీవలి కాలంలో కొందరు పాపులారిటీ కోసం చాలా పాకులాడుతున్నారు. ఇందుకోసం తమకు తోచిన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు.

  • Share this:
    ఇటీవలి కాలంలో కొందరు పాపులారిటీ కోసం చాలా పాకులాడుతున్నారు. ఇందుకోసం తమకు తోచిన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. అయితే కొందరు మాత్రం వింత చేష్టలతో.. పాపులారిటీ కోసం ప్రయత్నించి చిక్కులు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేమస్ అవ్వడం కోసం ఓ యువతి నడిరోడ్డుపై చిందులు వేసింది. రద్దీగా ఉండే కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు.. యువతి తన డ్యాన్స్‌తో దుమ్ములేపింది. అయితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అధికారులు ఆమెకు నోటీసు ఇచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఇండోర్‌లోని రసోమా స్క్వేర్ సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్‌ వద్ద శ్రేయా కల్రా అనే మహిళ (Shreya Kalra) రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    శ్రేయా కల్రా.. రెడ్‌ సిగ్నల్‌ పడటంతో హఠాత్తుగా రోడ్డు మీదకొచ్చి, ముఖానికి మాస్క్‌ వేసుకొని స్టెప్పులేసింది.ట్రాఫిక్‌ సిగ్నల్‌వద్ద వేచి ఉన్న ప్రయాణికులు ఆమె డ్యాన్స్‌ చూసి ఆశ్చర్చపోయారు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే ఆమె ఈ వీడియో చేసినట్టుగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తొలుత ముఖానికి మాస్క్ లేకుండా కనిపించిన ఆమె.. రెడ్ లైట్ పడగానే ముఖానికి మాస్క్ ధరించి.. డ్యాన్స్ చేసింది.

    Affair: తండ్రి ఎఫైర్ గురించి తెలుసుకున్న కూతురు.. అతడు ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో తెలిసి..

    శ్రేయా కల్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. ‘దయచేసి నియమాలను ఉల్లంఘించవద్దు. రెడ్ గుర్తు ఉంటే మీరు సిగ్నల్ వద్ద ఆగిపోవాలి. నేను డ్యాన్స్ చేస్తున్నందుకు కాదు. అలాగే అందరూ మాస్క్‌లు ధరించండి’అని పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకు 2.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆమె చర్యను తప్పుబట్టారు. రోడ్డుపై ఇలా చేయడమేమిటని విమర్శించారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డు మీద గంతులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.










    View this post on Instagram






    A post shared by Shreya Kalra (@shreyakalraa)








    ఈ ఘటన తీరా రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రా(Narottam Mishra) దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. మోటార్ వాహనాల చట్టం కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు హోం మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే అధికారులు శ్రేయా కల్రాకు నోటీసులు జారీ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: