Zomato | జొమాటో ఆర్డర్ క్యాన్సిల్ చేసిన వ్యక్తికి పోలీస్ నోటీస్

Zomato | ఓ ముస్లిం వ్యక్తి ఫుడ్ డెలివరీ చేయడానికి రావడంతో కస్టమర్ ఆ ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసేశాడు. ఇది పెద్ద దుమారానికి దారి తీసింది.

news18-telugu
Updated: August 1, 2019, 7:35 PM IST
Zomato | జొమాటో ఆర్డర్ క్యాన్సిల్ చేసిన వ్యక్తికి పోలీస్ నోటీస్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 1, 2019, 7:35 PM IST
జొమాటో ఫుడ్ యాప్‌లో ఓ హిందూయేతరుడు డెలివరీ చేశాడన్న కారణంతో అమిత్ శుక్లా అనే వ్యక్తి ఫుడ్‌ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన విషయం గుర్తుంది కదా. దీంతో ‘ఆహారానికి మతం లేదు. అదే ఒక మతం’ అంటూ జొమాటో ట్వీట్ చేయడంతో పెద్ద సంచలనంగా మారింది. దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఈ ఎపిసోడ్‌లో పోలీసులు ఎంటర్ అయ్యారు. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన అమిత్ శుక్లాకు మధ్య ప్రదేశ్ పోలీసులు నోటీసులు పంపారు. ‘భవిష్యత్తులో ఎప్పుడూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించను’ అంటూ రాసివ్వాలని వార్నింగ్ ఇచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నోటీస్ పంపామని పోలీసులు తెలిపారు.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...