స‌ర్కార్ వివాదం.. మురుగ‌దాస్ ఇంట్లో అర్ధ‌రాత్రి పోలీసుల హై డ్రామా..

ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఇంట్లో హై డ్రామా న‌డుస్తుంది. ఎవ‌రికి వాళ్లు రాజ‌కీయంగా "స‌ర్కార్" సినిమాతో ఆడేసుకుంటున్నారు. అర్ధరాత్రి పూట ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు వ‌చ్చిన సంగ‌తి క్ష‌ణాల్లో పాకిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 9, 2018, 12:31 AM IST
స‌ర్కార్ వివాదం.. మురుగ‌దాస్ ఇంట్లో అర్ధ‌రాత్రి పోలీసుల హై డ్రామా..
మురుగదాస్ దర్శకుడు
Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 9, 2018, 12:31 AM IST
ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ఇంట్లో హై డ్రామా న‌డుస్తుంది. త‌మిళ‌నాడులో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయో ఎవ‌రూ చెప్ప‌డం అంత ఈజీ కాదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. "స‌ర్కార్" సినిమాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సీన్స్ ఉన్నాయంటూ.. అలాగే జ‌య‌ల‌లిత‌తో పాటు క‌రుణానిధికి సంబంధించిన వివాదాస్ప‌ద డైలాగులు కూడా ఉన్నాయంటూ ఇప్పుడు ర‌చ్చ జ‌రుగుతుంది. ఎవ‌రికి వాళ్లు రాజ‌కీయంగా "స‌ర్కార్" సినిమాతో ఆడేసుకుంటున్నారు.

ఈ విష‌యంపై సినిమా యూనిట్ మాత్రం నోరు మెద‌ప‌కుండా వేడుక చూస్తున్నారు. మ‌రోవైపు క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా ఈ చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. టాక్‌తో ప‌నిలేకుండా ఇప్ప‌టికే రెండు రోజుల్లోనే 100 కోట్లు వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు అర్ధ‌రాత్రి మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు రావ‌డం.. అత‌న్ని అరెస్ట్ చేయాల‌ని చూడ‌టం సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు మా ఇంటికి వ‌చ్చారు.. చాలాసేపు త‌లుపులు కొట్టారు.. కానీ నేను ఆ స‌మ‌యంలో ఇంట్లో లేను.. విష‌యం చెప్ప‌గానే వాళ్లు వెళ్లిపోయారంటూ ట్వీట్ చేసాడు మురుగ‌దాస్.
Loading....

ఇక మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు వ‌చ్చిన సంగ‌తి క్ష‌ణాల్లో పాకిపోయింది. ఓ సినిమాకు సెన్సార్ అయిన త‌ర్వాత దాన్ని ప్ర‌జ‌లు చూసిన త‌ర్వాత అడ్డుకునే హ‌క్కు ఎవ‌రికీ లేదు.. అస‌లు ఏం జ‌రుగుతుంది త‌మిళ‌నాడులో.. పోలీసులు వ‌చ్చి అరెస్ట్ చేస్తారా అంటూ మురుగ‌దాస్ ఇష్యూపై ట్విట్ట‌ర్ లో స్పందించాడు విశాల్. మొత్తానికి ఇప్పుడు స‌ర్కార్ విడుద‌లైన మూడు రోజుల త‌ర్వాత వివాదం మ‌రింత ముదురుతుంది. మ‌రి చివ‌రి వ‌ర‌కు ఇది ఎక్క‌డ ఆగుతుందో చూడాలిక‌.
First published: November 9, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు