అతని వయసు 68.. ఆ గర్ల్‌ఫ్రెండ్ కోసం వెతుకుతూ బయలుదేరాడు.. మరి ఆమెను చేరుకన్నాడా..?

ప్రతీకాత్మక చిత్రం

ఓ 68 ఏళ్ల వృద్దుడి భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. అతనికి పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అయితే అతనికి ఫోన్ కాల్స్‌ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే..

 • Share this:
  ఇటీవలి కాలంలో ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు. అయితే ఇటువంటి వాటి వల్ల కొన్ని సందర్భాల్లో కొందరికి మంచి జరుగుతుండగా.. చాలా సందర్భాల్లో మోసపోతున్నవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా యువతీయువకులు ఇలాంటి పరిచయాలకు ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. అయితే పెద్దాయన కూడా ఫోన్ ద్వారా.. గుర్తు తెలియని మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ను కలిసేందుకు కూడా బయలుదేరాడు. ఈ ఘటన కేరళలో (Kerala) చోటుచేసుకుంది. అయితే అతనికి ఆ మహిళ కలిసిందా..?, ఈ ప్రయాణంలో అతనికి ఎవరూ సహకరించారు.. వంటి విషయాలను ఈ కథనంలో చూద్దాం..

  ఓ 68 ఏళ్ల వృద్దుడి భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. అతనికి పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు. అయితే అతనికి ఫోన్ కాల్స్‌ ద్వారా ఒక మహిళ పరిచయం అయింది. ఆమె భర్తను కోల్పోయింది. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఆమె కథ విన్న పెద్దాయన చలించి పోయాడు. ఆమెకు సాయం చేసేందుకు ఆమెను కలవడానికి బయలుదేరాడు. తనకు ఫోన్‌లో పరిచయమైన స్నేహితురాలును వెతకుతూ అతడు కూతుపరంబకు (Koothuparamba) చేరుకున్నాడు. కానీ ఇక్కడే ఊహించని పరిణామం ఎదురైంది.

  Car Loan: కారు లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే, ఈ నాలుగు విషయాలను తప్పక తెలుసుకోండి..

  ఇన్ని రోజులు ఆమెతో మాట్లాడిన ఫోన్ నెంబర్‌కు అతడు కాల్ చేయగా.. స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో అతడు తన వద్ద ఉన్న ఆధారాలతో మహిళ కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆటో డ్రైవర్‌తో కలిసి తనకు తెలిసిన వివరాలతో ఆమె ఆచూకీ కనుక్కోవడానికి తీవ్రంగా శ్రమించాడు. అయితే ఫలితం లేకుండా పోయింది. దీంతో కొద్ది గంటల తర్వాత ఆమె తనను మోసం చేసిందని గ్రహించాడు. మరోవైపు అతడి వద్ద ఆటోకు చెల్లించడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే అతడిని కూతుపరంబ పోలీస్ స్టేషన్‌కు (Koothuparamba police station) తీసుకెళ్లారు.

  Free Petrol: మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ.. బారులు తీరిన జనం.. ఎక్కడంటే..?

  అక్కడ పోలీసులకు అతడు.. జరిగిన విషయం చెప్పాడు. ఇది విన్న పోలీసులు అతనికి సాయం చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అతడితో ఫోన్‌లో మాట్లాడిన మహిళను సంప్రదించారు. అయితే తాను మూడు నెలలుగా అతడితో ఫోన్‌లో మాట్లాడిన మాట వాస్తమేనని.. కానీ అతడిని వ్యక్తిగతంగా కలిసేందకు తనకు ఇష్టం లేదని ఆ మహిళ పోలీసుల ముందు ఒప్పుకుంది. దీంతో పోలీసులు అతడిని ఓదార్చారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఇంటికి తిరిగి వెళ్లేందుకు కొంత డబ్బు సేకరించి అతడిని అందజేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: