Constable: నువ్వు గ్రేట్ బ్రదర్.. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ కానిస్టేబుల్ ఏం చేశాడో తెలిస్తే..

కానిస్టేబుల్ శివకుమార్

కర్ణాటకకు చెందిన ఓ కానిస్టేబుల్ సాహసమే చేశాడు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బావిలో దూకి మరీ నిందితుడి ప్రాణాలు కాపాడాడు. కానిస్టేబుల్ చూపిన చొరవపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

  • Share this:
    బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ కానిస్టేబుల్ సాహసమే చేశాడు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా బావిలో దూకి మరీ నిందితుడి ప్రాణాలు కాపాడాడు. కానిస్టేబుల్ చూపిన చొరవపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. యెళహంక పోలీస్ స్టేషన్‌లో శివకుమార్ అనే యువకుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 3న యెళహంకలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. గోల్డ్ చైన్‌, ఫోన్, రూ.3 వేల డబ్బు చోరీకి గురైంది.

    ఈ కేసును పరిష్కరించే టీంలో కానిస్టేబుల్ శివకుమార్ కూడా భాగమయ్యాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు యెళహంక ఎస్‌ఐ కె.పి. సత్యనారాయణ్ మరియు ఆయన టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ టీంలో శివకుమార్ ఒకరు. కేసు విచారణలో భాగంగా తొలుత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడు తమిళనాడులోని తొప్పూరు గ్రామానికి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఎస్‌ఐ సత్యనారాయణ్‌తో పాటు శివకుమార్, టీంలోని మిగతా పోలీసులు ఆదివారం రాత్రి సమయంలో నిందితుడు ఉన్న గ్రామానికి చేరుకున్నారు.

    ఆ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. రాత్రి సమయం కావడంతో చీకటిగా కూడా ఉంది. కానిస్టేబుల్ శివకుమార్ నిందితుడిని పట్టుకునేందుకు అతని వెంట పరిగెత్తాడు. అయితే.. ఈ క్రమంలో నిందితుడు చీకట్లో చూసుకోకుండా పాతిక అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. చిమ్మ చీకటి. పైగా జోరున వర్షం కురుస్తోంది. అప్పటికే నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. నిందితుడికి ఈత కూడా రాదని గుర్తించిన శివకుమార్ క్షణం కూడా వృధా చేయకుండా అతనిని కాపాడేందుకు ముందుకొచ్చాడు. జీప్‌కు తాడు కట్టి బావిలోకి దూకి నిందితుడిని తనను పట్టుకోమని చెప్పాడు. అయితే.. మద్యం మత్తులో ఉన్న నిందితుడు ఏం చేస్తున్నాడో తనకే తెలియడం లేదు. అతని పరిస్థితిని గమనించిన శివకుమార్ తానే నిందితుడిని భుజాన వేసుకున్నాడు. తోటి పోలీసులు ఆ తాడును పైకి లాగారు.

    ఇది కూడా చదవండి: Newly Married: ఎంతపని చేశావ్ బ్రదర్.. పెళ్లయిన 38 రోజులకే ఇలా చేయడం.. తొందరపడ్డావేమో..!

    ఇలా.. కానిస్టేబుల్ చూపిన చొరవతో నిందితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కటికి చీకట్లో కానిస్టేబుల్ తోటి మనిషి ప్రాణాన్ని కాపాడటానికి చేసిన సాహసంసై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. పోలీసులపై గౌరవం మరింత పెరిగేలా చేశాడని శివకుమార్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. నిందితుడిని కాపాడిన అనంతరం.. పోలీస్ స్టేషన్‌కు తరలించి అతనిని విచారించారు. ఈ దొంగతనంలో తనకు సహకరించిన వారి పేర్లను నిందితుడు బయటపెట్టాడు. ఇదిలా ఉండగా.. కానిస్టేబుల్ శివకుమార్ చూపిన ధైర్యసాహసాలకు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ అతనిని అభినందించి రివార్డ్ ప్రకటించారు.
    Published by:Sambasiva Reddy
    First published: