తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడమే కాదు..ఎవరైనా సమస్యల్లో ఉన్నారంటే సాయం కూడా చేస్తామని నిరూపించారు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)పోలీసులు. చాలా విచిత్రమైన గొడవను పోలీసులే సున్నితంగా పరిష్కరించారు. కేసులు, సెక్షన్లతో పని లేకుండా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కలిసి ఓ కుటుంబ సమస్యగా చక్కదిద్దారు. పీటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్లికి తామే పెద్దలుగా వ్యవహరించి అమ్మాయి, అబ్బాయిని ఒకటి చేశారు. ఉత్తరప్రదేశ్ డియోరియా(Deoria)జిల్లాలోని గౌరిబజార్(Gauribazar)పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఘటన చోటుచేసుకుంది. గోరఖ్పూర్(Gorakhpur)జిల్లా మైధియా పోఖారీ(Maidhiya Pokhari)గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్(Sanjay Yadav)తో గౌరిబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకి గ్రామానికి చెందిన అదితి యాదవ్(Aditi Yadav)తో వివాహం నిశ్చయమైంది.అనుకున్న ప్రకారం పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు బంధువులు, మేళ, తాళాలతో వచ్చాడు. ముహుర్తం అర్ధరాత్రి కావడంతో ఊరేగింపుగా వచ్చిన అబ్బాయి తరపు బంధువులు భోజనాలు చేసి హాయిగా పెళ్లిసి సిద్ధమైన సమయంలో పెళ్లి(Marriage)ఆగిపోయింది. ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కట్టే మంగళసూత్రం(Mangalasutra)తీసుకురాలేదు. అమ్మాయి తరపు బంధువులు మంగళసూత్రం ఎందుకు తీసుకురాలేదేని ప్రశ్నిస్తే శకునం బాగోలేదని అందుకే తేలేదని చెప్పారు. దాంతో ఆగ్రహించిన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు వివాహం రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. దాంతో అమ్మాయి, అబ్బాయి తరపు మధ్య వాగ్వాదం జరిగింది. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులే పెళ్లి పెద్దలు..
గౌరీబజార్ పోలీస్స్టేషన్ ఎస్ఐ విపిన్ మాలిక్ తన పోలీస్ బృందంతో వివాహ వేడుక జరుగుతున్న ఇంటికి చేరుకున్నారు. పెళ్లి ఆగిపోవడానికి కారణాలు తెలుసుకున్నారు. మంగళసూత్రం వల్లే పెళ్లి ఆగిపోవడం సరికాదని..అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. అబ్బాయి తరపు బంధువుల ద్వారా మంగళసూత్రం తెప్పించారు. ఈ రాత్రి అంతా పోలీసులు అక్కడే ఉండే మంగళసూత్రం రాగానే దగ్గరుండి వివాహం జరిపించారు.
పీటలపై ఆగిపోయిన పెళ్లి..
మంగళసూత్రం తెచ్చే వరకు అబ్బాయి తరపుబంధువులను పోలీస్ స్టేషన్లో ఉంచి పోలీసులే విడిది కల్పించారు. అటుపై పోలీసులు వరుడు సంజయ్ యాదవ్ని తీసుకొని పెళ్లి కుమార్తె అదిథి యాదవ్ నివాసానికి వెళ్లారు. ఎలాంటి విభేదాలు తలతెత్తకుండా పోలీసులు అందరూ దగ్గరుండి వివాహం జరిపించారు. అంతే కాదు పెళ్లి కుమార్తెను తన సోదరిగా భావించిన ఎస్ఐ విపిన్ మాలిక్ సెల్ఫోన్ని బహుమతిగా అందజేశారు. పోలీసులు చొరవ వల్లే తమ వివాహం జరిగిందని..వారికి తమ కృతజ్ఞతలు తెలిపారు నూతన వధువరులు. పీటలపై పెళ్లి ఆగిపోకుండా ఇద్దరిని కలిపిన గొప్ప మనుషులు పోలీసులు అంటూ స్థానికులు పోలీసుల చర్యల్ని అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Viral Video, Wedding