Home /News /trending /

POLICE CAUGHT CAT WHILE SMUGGLING COCAINE MARIJUANA DRUGS INTO PANAMA PRISON SK GH

Cat Smuggler: ఇది మామూలు పిల్లి కాదు.. జైల్లోకి డ్రగ్స్ సరఫరా.. పోలీసు కళ్లుగప్పి స్మగ్లింగ్..

డ్రగ్స్ తరలిస్తున్న పిల్లి అరెస్ట్

డ్రగ్స్ తరలిస్తున్న పిల్లి అరెస్ట్

పిల్లికి బయట వ్యక్తులెవరో మాదక ద్రవ్యాలను కట్టారు. అది జైలులోకి వచ్చిన తర్వాత.. ఖైదీలు పిల్లికి ఇష్టమైన ఆహారాన్ని చూపించి ఆకర్షిస్తారు. దగ్గరకు వచ్చిన తరువాత దాని శరీరానికి కట్టిన వస్త్రంలోని మాదక ద్రవ్యాలను తీసి దాచుకుంటున్నారు.

జైలు అధికారుల కళ్లుగప్పి అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు ఓ స్మగ్లర్ ప్రయత్నించాడు. అనుభవజ్ఞులైన పోలీసు అధికారులు, సిబ్బందిని మభ్యపెట్టి జైలులో చొరబాటుకు యత్నించాడు. అయితే పోలీసులు తెలివిగా వ్యవహరించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే కరడుగట్టిన నేరస్థుడెవరో ఈ నేరానికి ఒడిగట్టాడని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే స్మగ్లింగ్ చేసింది మనిషి కాదు.. ఒక పిల్లి. అవును.. పనామాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనామాకు ఉత్తరాన ఉన్న కోలన్ అనే కరేబియన్ ప్రావిన్స్‌లోని న్యూజా ఎస్పెరెంజా జైలులో ఏప్రిల్ 16న ఒక పిల్లి ఈ నేరానికి పాల్పడింది. పిల్లి శరీరానికి ఓ మూట కట్టి ఉండటం గమనించి అధికారులు పట్టుకున్నారు. పనామా పెనిటెన్షియరీ సిస్టం ఆఫ్ హెడ్ ఆండ్రెస్ గుటెరిజె ఈ సంఘటనపై స్పందించారు. పిల్లి మెడకు ఓ వస్త్రం కట్టి ఉందని, అందులో తెల్లటి పొడి, కూరగాయల మిశ్రమం, కొన్ని రకాల ప్యాకెట్లు ఉన్నాయని తెలిపారు. వీటిల్లో గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు జంతువులను ఉపయోగించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి ఘటన బయట పడటం ఇదే మొదటి సారి కాదని ఆండ్రెస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పిల్లిని అడాప్షన్ సెంటర్‌కు తరలించినట్లు ప్రాసిక్యూటర్ ఎడ్వర్డో రోడ్రిగ్రేజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక ప్రాసిక్యూటర్లు తెలిపారు. పిల్లికి బయట వ్యక్తులెవరో మాదక ద్రవ్యాలను కట్టారు. అది జైలులోకి వచ్చిన తర్వాత.. ఖైదీలు పిల్లికి ఇష్టమైన ఆహారాన్ని చూపించి ఆకర్షిస్తారు. దగ్గరకు వచ్చిన తరువాత దాని శరీరానికి కట్టిన వస్త్రంలోని మాదక ద్రవ్యాలను తీసి దాచుకుంటున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఈ పిల్లి ఫోటోలను కోలన్ డ్రగ్స్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ట్విట్టర్లో పంచుకుంది.

పనామా జైలులో 23 గదులు ఉన్నాయి. ఇక్కడ 1800 మంది ఖైదీలు ఉన్నారు. ఇవి అత్యంత రద్దీగా ఉంటాయి. ఇలాంటి అసాధారణమైన అక్రమ రవాణా ఇదే మొదటి సారి కాదు. కొన్ని దేశాల్లో జంతువులను, ప్రత్యేకంగా పిల్లులను మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన ఘటనలు వెలుగు చూశాయి. పావురాలు, డ్రోన్ల ద్వారా కూడా కొందరు వ్యక్తులు డ్రగ్స్ తరలిస్తున్నారు. అయితే ఇలాంటి కేసులను చాలా వరకు అధికారులు అడ్డుకుంటున్నారు. పిల్లి మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతూ పట్టబడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ అంశంపై ఫన్నీగా స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ చేసి ఈ వివరాలను పోస్ట్ చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Drugs, International news, Smuggling, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు