ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)రాజధాని లక్నో(Lucknow)లో ఓ యువకుడు సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ప్రయత్నించి జైలు పాలయ్యాడు. లక్నోలోని ఎకానా స్టేడియం (Ekana Stadium)సమీపంలో కారు టాప్‌పై నిలబడి దర్జాగా హుక్కా తాగుతూ రీల్ వీడియో చేశాడు. పబ్లిక్ ప్లేసులో రీల్ వీడియో కోసం యువకుడు చేసిన ఓవర్ యాక్షన్‌ను రోడ్డుపై వెళ్తున్న వాళ్లు షూట్ చేసి పోలీసులకు షేర్ చేయడంతో వివరాలు సేకరించారు. కారుపై హుక్కా తాగుతూ రీల్(Reel) వీడియో చేసిన వ్యక్తి పేరు రజా అహ్మద్(Raza Ahmed)గా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసులు.
రీల్ వీడియో కోసం రిస్క్ ..
ఈ వీడియో విశేషం ఏమిటంటే యువకుడు రీల్ కోసం చేసిన వీడియోలో రజా అహ్మద్ వాడిన కారు టాప్‌పై నిలబడి హుక్కా తాగుతూ బ్యాక్‌గ్రౌండ్‌లో రంగ్‌బాజీకి సంబంధించిన సినిమా పాటని ప్లే చేస్తూ గాల్లోకి పొగ ఊదుతూ హీరోలా ఫీలయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కారు నెంబర్ ప్లేటుపై UP 40-AP 0075 అనే నంబర్‌గా గుర్తించారు. రూ.7500 ఫైన్ వేశారు. కారును వేదికి పట్టుకొని సీజ్ చేశారు.
కటకటాల వెనక్కు..
కారు నంబర్ ప్లేట్ బహ్రైచ్‌కు చెందినదని తేలింది. ఆ తర్వాత సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు మరియు నిందితుడిని అరెస్టు చేశారు మరియు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర గిరి తెలిపారు. ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lucknow, Uttar pradesh, Viral Video