• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • POLICE ANNOUNCED CASH REWARDS TO BRIDES WHO OPPOSE BOOZE PARTIES AT WEDDINGS IN UTTARAKHAND HSN

పెళ్లి వేడుకలో పోలీసులు ప్రత్యక్ష్యం.. పెళ్లికూతురే పిలిచిందని షాక్.. అసలు విషయం తెలిసి మగాళ్లందరికీ మైండ్ బ్లాంక్..!

పెళ్లి వేడుకలో పోలీసులు ప్రత్యక్ష్యం.. పెళ్లికూతురే పిలిచిందని షాక్.. అసలు విషయం తెలిసి మగాళ్లందరికీ మైండ్ బ్లాంక్..!

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి వేడుకలోకి కొందరు పోలీసులు వచ్చారు. బంధువుల్లో టెన్షన్. వాళ్లెందుకు వచ్చారా? అని తీరా చూస్తే వాళ్లను పెళ్లికూతురే పిలిచింది. తన పెళ్లిలో భాగంగా జరుగుతున్న ఓ కార్యక్రమం ఆమెకు ఇష్టం లేదట. అందుకే పోలీసులకు ఫోన్ చేసిందట.

  • Share this:
    అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. ఇంతలో అక్కడకు కొందరు పోలీసులు వచ్చారు. బంధువుల్లో టెన్షన్. వాళ్లెందుకు వచ్చారా? అని తీరా చూస్తే వాళ్లను పెళ్లికూతురే పిలిచింది. తన పెళ్లిలో భాగంగా జరుగుతున్న ఓ కార్యక్రమం ఆమెకు ఇష్టం లేదట. అందుకే పోలీసులకు ఫోన్ చేసిందట. పోలీసులు వచ్చి ఆ పెళ్లిలో తనకు ఇష్టం లేని ఆ కార్యక్రమాన్ని రద్దు చేయించారు. ఏంటీ.. ఇలా కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపోతున్నారా? పెళ్లికూతురికి ఇష్టం లేని ఆ కార్యక్రమం ఏంటా? అని ఆలోచిస్తున్నారా? ఉత్తరాఖండ్ లో ఓ కొత్త స్కీమ్ ను పోలీసులే ప్రారంభించారు. వాస్తవానికి ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్ లను ప్రవేశపెడుతుంటాయి. కానీ ఉత్తరాఖండ్ లో పోలీసులే ముందుకొచ్చి ఆ కొత్త స్కీమ్ ను ప్రారంభించారు. అమ్మాయిలకందరికీ ఆ స్కీమ్ గురించి తెలియజేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

    మద్యం నిషేధంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలోని దేవ్ ప్రయాగ్ పోలీస్ స్టేషన్ లో ఓ కొత్త ప్రయోగానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. పెళ్లి వేడుకల్లో ధూంధాం అనిపించేలా డీజేలు, బాజా భజంత్రీలతోపాటు ఫుల్లుగా మద్యం పార్టీలు కూడా జరుగుతుంటాయన్నది తెలిసిందే. తమ పెళ్లిలో మద్యం ఏరులై పారకూడదని అందరు అమ్మాయిలు అనుకుంటుంటారు. కానీ మద్యం పార్టీ జరుగుతోంటే ఏం చేయలేక మిన్నకుండి పోతారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఓ యువతిపై అమెరికా నుంచి తెలుగు టెకీ ఫిర్యాదు.. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులకే..

    అలాంటి అమ్మాయిలు ముందుకొచ్చి తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. అలా ఫిర్యాదు చేస్తే తాము అక్కడకు వచ్చి మద్యం పార్టీలు జరగకుండా చూస్తామని దేవ్ ప్రయాగ్ పోలీసులు చెబుతున్నారు. అంతే కాదండోయ్, అలా ఫిర్యాదు చేసి పెళ్లిలో మద్య నిషేదానికి పూనుకున్న వధువులకు 10,001 రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తారట. దీనికి ’సోదరి కన్యాదాన్ స్కీమ్‘ అని పేరు కూడా పెట్టారు. ఈ విషయం తెలిసి కుర్రాళ్లంతా షాకవుతోంటే, యువతులు మాత్రం ఎగిరిగంతేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లిళ్లలో ఎన్ని ఎన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.
    ఇది కూడా చదవండి: ఓ ప్రేమ జంట రియల్ క్రైమ్ స్టోరీ.. టాలీవుడ్ లో కలకలం రేపిన కిడ్నాప్.. 6గంటల్లోనే చేధించిన పోలీసులు..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు