Home /News /trending /

అక్కడ కుక్క‌ల‌కు, గుర్రాల‌కూ పెన్షన్.. నిజంగా అద్భుతం.. ఎందుకో తెలిస్తే షాక‌వుతారు

అక్కడ కుక్క‌ల‌కు, గుర్రాల‌కూ పెన్షన్.. నిజంగా అద్భుతం.. ఎందుకో తెలిస్తే షాక‌వుతారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్ర‌స్తుతం సేవ‌లందిస్తున్న‌ 1200 శున‌కాల‌కు, 60 పైగా గుర్రాల‌కు రిటైర్మెంట్ బెనిఫిట్ అందుతుంది. మంత్రిత్వ‌శాఖ లెక్క‌ల ప్ర‌కారం, ప్ర‌తి ఏడాది ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో ప‌నిచేసే 10% జంతువులు రిటైర్ అవుతాయి. వీటిలో ఎక్కువ‌గా జ‌ర్మ‌న్ ష‌ప‌ర్డ్‌ (German Shepard)‌, బెల్జియ‌న్ ష‌ప‌ర్డ్ శున‌కాలే ఎక్కువ‌.

ఇంకా చదవండి ...
మన దేశంలో ముసలివాళ్లు, వికలాంగులే పెన్షన్ పథకంలో పేరు నమోదు చేయించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికే పెన్ష‌న్ సౌక‌ర్యం తొల‌గిస్తున్న కాలంలో మ‌నం ఉన్నాం. అయితే పోలాండ్ ప్ర‌భుత్వం మాత్రం కుక్కలు, గుర్రాలకూ పెన్షన్ ఇవ్వబోతోంది. ప్ర‌భుత్వ విధుల్లో స‌హ‌క‌రించిన జంతువులకీ అధికారిక హోదా ఇచ్చి, రిటైర్మెంట్ త‌ర్వాత పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించే ఆలోచ‌న చేస్తోంది.

పోలాండ్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి త‌మ లెజిస్లేష‌న్ ముందు త్వ‌ర‌లో ఈ బిల్లుని ప్ర‌వేశ‌పెట్టాల‌ని అనుకుంటున్నారు. ఇది చ‌ట్టంగా రూపుదిద్దుకుంటే.. ప్ర‌స్తుతం సేవ‌లందిస్తున్న‌ 1200 శున‌కాల‌కు, 60 పైగా గుర్రాల‌కు రిటైర్మెంట్ బెనిఫిట్ అందుతుంది. మంత్రిత్వ‌శాఖ లెక్క‌ల ప్ర‌కారం, ప్ర‌తి ఏడాది ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో ప‌నిచేసే 10% జంతువులు రిటైర్ అవుతాయి. వీటిలో ఎక్కువ‌గా జ‌ర్మ‌న్ ష‌ప‌ర్డ్‌ (German Shepard)‌, బెల్జియ‌న్ ష‌ప‌ర్డ్ శున‌కాలే ఎక్కువ‌. సాధార‌ణంగా వీటి ప‌ని క్లిష్టంగానే ఉంటుంది. కూలిపోయిన భ‌వ‌నాల కింద మ‌నుషుల్ని వెతక‌డం, పారిపోయిన వారిని వెతికి ప‌ట్టుకోవ‌డం, మాదక‌ద్ర‌వ్యాల‌ను, పేలుడు ప‌దార్థాల‌ను గుర్తించ‌డం, స్మ‌గ్ల‌ర్ల‌ను, రౌడీ మూక‌ల‌ను నిరోధించే ప‌నిలో ఇవి చాలా కృషి చేస్తాయి. ఇంత చేసినా వీటికి ద‌క్కేది మాత్రం మంచి ఆహారం, ఉండ‌టానికి మంచి చోటు, మ‌హా అయితే ఎప్పుడ‌న్నా మెచ్చుకోలుగా త‌ల నిమురుతారు. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో ప్రాణాల‌కు తెగించి ప‌నిచేసే వీటికి రిటైర్మెంట్ అయిన త‌ర్వాత ఎలాంటి ప్ర‌భుత్వ స‌హ‌కార‌మూ దొర‌క‌దు.

పోలాండ్‌లో ఇలా ప్ర‌భుత్వ ప‌నుల కోసం పోలాండ్ పోలీస్ శాఖ‌లో, బోర్డ‌ర్ గార్డు ద‌గ్గ‌ర‌, అగ్నిమాప‌క శాఖ‌లో ప‌నిచేస్తున్న శున‌కాలు, గుర్రాలకు రిటైర్మెంట్ త‌ర్వాత వాటికి ఖ‌రీదైన వైద్యం అందించాల్సి ఉంటుంద‌ని వార్సా పోలీస్ స్నిఫ్ఫ‌ర్ డాగ్ ఆర్బిటా నిర్వ‌హించే పావెల్ కుచినియో పేర్కొన్నారు. శున‌కాల్లో అయితే ఒత్తిడికి గురైన వాటి వెనుక కీళ్ల‌కు చికిత్స అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని చెబుతారాయ‌న‌.

పోలాండ్‌లో ఇలా ప‌ద‌వీవిర‌మ‌ణ‌ పొందిన‌ కుక్క‌లు, గుర్రాల కోసం `ది వెట‌ర‌న్స్ కార్న‌ర్‌` అనే ఒక్క షెల్ట‌ర్ హోమ్ ఉంది. స్లవోమీర్ వాల్కోవియ‌క్ అనే 50 ఏళ్ల రిటైర్డ్ పోలీసు దీన్ని న‌డుపుతుంటారు. నెల నెలా వీటి ఆహారం, ఆరోగ్యం కోసం వేలాది డాలర్లు ఖర్చయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందదు. వెస్ట్-సెంట్ర‌ల్ పోలాండ్ లోని జిర్లాటోవోలో ప్రైవేటుగా నిర్వ‌హిస్తున్న ఫార్మ్ లాంటి షెల్ట‌ర్‌లో 10 శున‌కాలు, 5 రిటైర్డ్ పోలీసు గుర్రాలు మంచి విశాల‌మైన పెడాక్‌లో నివ‌శిస్తున్నాయి. రిటైర్మెంట్ త‌ర్వాత వాటికి అయ్యే ఖ‌ర్చు ఎక్కువ‌గానే ఉండ‌టం వ‌ల్ల వాటిని సంర‌క్షించే య‌జ‌మానులకు వాటిక‌య్యే ఖ‌ర్చును అంద‌జేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌తగా భావిస్తున్నారు.

వీటికి సేవ‌లందిస్తున్న వారి రిక్వెస్ట్‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని, ఇంటీరియ‌ర్ మినిస్ట‌ర్ వీటికి అధికారిక‌ హోదా క‌లిగించాల‌ని త‌మ కొత్త లెజిస్లేష‌న్ ముందు ప్ర‌పోజ‌ల్ పెట్టారు. ఇంటీరియ‌ర్ మినిస్ట‌ర్ మారియూజ్ క‌మిన్‌స్కీ చ‌ట్టం చేయ‌డానికి రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌ని `నైతిక బాధ్యత‌`గా అభివ‌ర్ణించారు. ఈ ఏడాది త‌ర్వాత దీన్ని అమోదించ‌డం కోసం పార్ల‌మెంటు ముందు ఉంచిన‌ప్పుడు దీనికి ఎలాంటి అబ్జెక్ష‌న్లు పెట్ట‌కుండా ఏక‌గ్రీవంగా ఆమోదించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: International news, VIRAL NEWS

తదుపరి వార్తలు