హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గొప్ప మనసు చాటుకున్న మోదీ.. తన కాన్వాయ్ ను ఆపేసి.. అంబులెన్స్ కు దారి.. వీడియో వైరల్...

గొప్ప మనసు చాటుకున్న మోదీ.. తన కాన్వాయ్ ను ఆపేసి.. అంబులెన్స్ కు దారి.. వీడియో వైరల్...

అంబులెన్స్ కు దారి ఇచ్చిన మోదీ కాన్వాయ్

అంబులెన్స్ కు దారి ఇచ్చిన మోదీ కాన్వాయ్

Gujarat: ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM MOdi) తన గొప్పమనసు చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ (Gujarat) పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన.. అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ సెంటర్ దగ్గర తన బహిరంగ ర్యాలీని ముగించుకుని గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు ప్రధాని మోదీ వెళ్తున్నారు. రోడ్డుపైన మోదీ కాన్వాయ్ వెళ్తుంది. ఇంతలో ఒక అంబూలెన్స్ కూడా రోడ్డు మీద అదే మార్గంలో వెళ్తుంది.

అయితే.. వెంటనే ప్రధాని కాన్వాయ్ లోని రెండు వాహానాలు రోడ్డుకు ఎడమ వైపుగా తప్పుకున్నాయి. వెంటనే మోదీ కాన్వాయ్ ను దాటుకుంటూ అంబూలెన్స్ (Ambulance) ముందుకు వెళ్లిపోయింది. దీంతో కాసేపు ప్రధాని మోదీ వాహన శ్రేణి రోడ్డుమీదే ఆగిపోయింది.

అంబులెన్స్ వెళ్లిపోయాక మోదీ వాహన శ్రేణి తిరిగి ప్రారంభమైంది. ఈ వీడియోను గుజరాత్ బీజేపీ నాయకులు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది. తన గుజరాత్ పర్యటనలో రెండవ రోజు, ప్రధాని మోదీ గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను కూడా ప్రారంభించారు. సాయంత్రం బనస్కాంత జిల్లాకు వచ్చిన ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రసిద్ధ అంబాజీ ఆలయంలో హారతి కూడా నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగుళూరు(Benguluru)లో ట్రాఫిక్ జామ్ భారీగానే ఉంటుంది.

దేశ,విదేశాల నుంచి నిత్యం బెంగళూరుకి వేలాదిమంది వస్తుంటారు,అలాగే సిటీలో నివసించేవారి సంఖ్య కూడా కోటి పైనే ఉంటుంది. అయితే భారీ ట్రాఫిక్ జామ్(Traffic Jam) కారణంగా చాలామంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడం ఆలస్యమవుతుండటం బెంగళూరులో చాలా సర్వసాధారంగా మారింది. బస్సు ఎక్కినా,క్యాబ్ ఎక్కినా,బైక్ మీద ఆఫీసులకు వెళ్లాలనుకున్నా కొన్నిసార్లు గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయి రోడ్డుపైనే మన సమయం అంతా వృద్ధాగా పోతుంటది. బెంగళూరు సిటీలో మెట్రో ఉంది కదా మరి ఇంత ఇబ్బంది ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. బెంగుళూరులో మెట్రో సేవలు ఉన్నప్పటికీ నగరంలోని అన్ని ప్రాంతాలకి ఆ సౌకర్యం లేదు.

కేవలం కొన్ని ఏరియాలకు మాత్రమే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే నగరంలో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ కారణంగా చాలామంది తమ తమ ఆఫీసులకు లేటుగా వెళ్లి బాస్ చేత తిట్టు కూడా తింటుంటారు. అయితే ఇక నుంచి ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఆఫీసులకు,సిటీ నుంచి ఎయిర్ పోర్ట్ కి నిమిషాల్లో చేరుకోవచ్చు. బెంగుళూరులో వచ్చే నెల 10వ తేదీ నుంచి హైలికాఫ్టర్ రైడ్ సేవలు(Helicopter Ride Service In Bengaluru) ప్రారంభం కానున్నాయి.

అర్బన్ ఎయిర్ మొబిలిటీ సంస్థ BLADE India బెంగళూరు ప్రజలకు ట్రాఫిక్‌ను ఎదుర్కోవటానికి గొప్ప ఆఫర్ ఇచ్చింది. బెంగళూరు సిటీ- కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణం కోసం ఛాపర్ సేవలను ప్రారంభించనున్నట్లు బ్లేడ్ ఇండియా(Blade India)ప్రకటించింది. అక్టోబర్ 10 నుండి హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభమవుతాయి. వారానికి ఐదు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హిందూస్థాన్ ఏరోనాటికల్ ఎయిర్‌పోర్ట్( HAL)నుండి బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 హెలికాప్టర్లను నడపనున్నట్లు బ్లేడ్ ఇండియా ప్రకటించింది. H125 DVG ఎయిర్‌బస్ హెలికాప్టర్.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం- బెంగళూరు విమానాశ్రయం మధ్య ఒకేసారి ఐదు నుండి ఆరుగురు ప్రయాణికులతో ప్రయాణించగలదు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Free ambulance, Gujarat, Pm modi, Viral Video

ఉత్తమ కథలు