దేశంలో మరో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. సెంట్రల్ విస్టాను, కర్తవ్యపథ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంను మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత.. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ విగ్రహం తెలంగాణ గ్రానైట్ తో తయారైంది. ఇది 28 అడుగుల ఎత్తును కల్గి ఉంది. ఈ విగ్రహన్ని తెలంగాణలోని ఖమ్మంలో నుంచి 140 చక్రాలు గల ప్రత్యేక వాహనంలో,280 టన్నుల మెట్రిక్ టన్నుల ఏకశిల గ్రానైట్ రాయిని ఢిల్లీకి తెప్పించి, ఈ విగ్రహన్ని తయారు చేయించారు.స్వాతంత్ర ఉద్యమంలో దేశం కోసం తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, అర్పించిన వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన చేసిన త్యాగాలను వచ్చే తరాలకు చేరేలా ఆయన విగ్రహన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో మోదీ.. విగ్రహన్ని ఆవిష్కరించి, పువ్వులను అర్పించి, శిరస్సు వంచి అంజలి ఘటించారు. సుభాష్ చంద్రబోస్ దేశంకోసం చేసిన త్యాగాలను మరోసారి స్మరించుకుంటూ మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
సెంట్రల్ విస్టాలో స్వాతంత్ర ఉద్యమ కాలంలోని సంఘటనలను ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న కార్మికులతో ప్రధాని మోదీ సంభాషించారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వారందరినీ జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానిస్తానని ప్రధాని మోదీ 'శ్రమజీవిస్'కు తెలిపారు.
#WATCH | PM Narendra Modi unveils the statue of Netaji Subhas Chandra Bose beneath the canopy near India Gate
(Source: DD) pic.twitter.com/PUJf4pSP9o
— ANI (@ANI) September 8, 2022
ఇదిలా ఉండగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Indian PM Narendra Modi) సరికొత్త పథకాన్ని ప్రకటించారు.
అదే పీఎం శ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీమ్. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల (Schools)ను ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.ఈ పథకాన్ని జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నూతన విద్యా విధానాన్ని 2020లో ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పాఠశాలల్లో సిలబస్ మార్పుతో పాటు బోధనా పద్ధతులలో మార్పులు చేయనున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ లెవల్స్‌లో విద్యార్థులకు చదువు చెప్పే విధానంలో మార్పులు తీసుకొచ్చి, వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
* నిధులు
ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్రం విడుదల చేసే నిధులు 60 శాతం ఉండగా, మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు ఇదే విధంగా తమ నిధులను సమకూర్చుకోవాలి. జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం 90 శాతం వరకు నిధులను అందించొచ్చు. ఈ నిధుల ద్వారా స్కూల్స్‌ను అప్ గ్రేడ్ చేసి అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.
* సదుపాయాలు
ఈ స్కీమ్ లో భాగంగా పాఠశాలల్లో ల్యాబ్‌లు, మోడ్రన్ క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్, ఆర్ట్ స్టూడియోస్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హితంగా ఈ పనులు జరగాలని కేంద్రం సూచించింది. పీఎం శ్రీ స్కీమ్ ద్వారా పాఠశాలల దశ, దిశ మారి అవి ‘మోడ్రన్ స్కూల్స్’గా మారుతాయని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ పథకం ద్వారా దేశంలోని వేల మంది విద్యార్థులకు లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లో సిలబస్ మార్పులకు తగ్గట్లు పీఎం శ్రీ పథకం ద్వారా మోడ్రన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.