పంజాబీ దళితుల ఆరాధ్యదైవం, ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అక్కడ భక్తులతో కలిసి రవిదాస్ భజన కీర్తనలు పాడుతూ, కంజర వాయిస్తూ ప్రత్యేక క్షణాలను ఆస్వాదించారు..
పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని దళితులు దేవుడిలా పూజించుకునే ప్రముఖ కవి సంత్ రవిదాస్ జయంతి వేడుకలో బుధవారం ఘనంగా జరిగాయి. పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో భారీ కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీ కరోల్ బాగ్ లోని గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్ లో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి మోదీ రవిదాస్ భజన కీర్తనలు చేశారు. కంజర వాయిస్తూ తాదాత్మ్యం చెందారు. ‘ఇవెంతో ప్రత్యేకమైన క్షణాలు..’అంటూ ఆ వీడియోను మోదీ షేర్ చేశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పఠాన్ కోట్ వెళ్లడానికి ముందు ప్రధాని మోదీ ఢిల్లీలోనే గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌ను సందర్శించారు. అక్కడి రవిదాస్ విగ్రహం వద్ద ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మందిర్‌లోని భక్తులతో కొంతసేపు మాట్లాడిన ప్రధాని.. వారితో కలిసి భజన కీర్తనల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కీర్తనలు ఆలపించారు.
గురు రవిదాస్ జయంతి పంజాబ్ దళితుల ప్రముఖ పండగ. 15-16 శతాబ్దానికి చెందిన సంత్ రవిదాస్ తన కీర్తనలతో ప్రజలను చైతన్యవంతం చేశారు. ఆయనను ఆరాధించేవారు పంజాబ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రవిదాస్ జయంతిని పురస్కరించుకునే ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి మార్చారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.