ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన వందేమాతరం పాట ఇప్పటికీ ఫేమసే. స్వాతంత్ర్య దినోత్సవం గానీ, గణతంత్ర దినోత్సవానికి ఆ పాట లేకుండా వేడుకలు జరగవంటే అతిశయోక్తి కాదేమో. అంతలా హిట్ అయింది ఆ పాట. ఎందరో జీవితాలను ప్రభావితం చేసిన ఆ పాటకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నది. అదేంటి..? దానిని మళ్లీ ఏమైనా రీమిక్స్ చేస్తున్నారనుకుంటున్నారా..? అదేం కాదు. వందేమాతరం పాటను మిజోరాం కు చెందిన ఒక నాలుగేళ్ల అమ్మాయి పాడింది. ఆమె ముద్దులొలికే హావబావాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పాపకు పీఎం మోడీ కూడా ఫ్యాన్ అయిపోయారు.
ఇక వీడియోకు సంబంధించి.. మిజోరాం కు చెందిన ఎస్తేర్ హమ్టే లుంగ్లీ నాలుగేళ్లచిన్నారి. ఆమె ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘మా తుజే సలామ్’ పాటను పాడింది. కొన్నిపదాలు పలకడానికి వీలుకాకున్నా.. ఎక్కడా శ్రుతి తప్పకుండా పాట పాడింది. ఈ పాటకు మిజోరాం సంస్కృతిని కూడా జోడించి ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Adorable and admirable! Proud of Esther Hnamte for this rendition. https://t.co/wQjiK3NOY0
— Narendra Modi (@narendramodi) October 31, 2020
లుంగ్లీ వీడియోను ఆ రాష్ట్ర సీఎం జోరంతంగా ట్వీట్ చేశారు. ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. అనంతరం సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ కూడా ఈ వీడియోను చూసి ముచ్చట పడ్డారు. ఆ పాప ఎక్స్ప్రెషన్స్ కు ఆయన ఫిదా అయ్యారు.
When you are showered with cuteness and love 😊🌹Esther (4 years) https://t.co/AgCjcLXfov via @YouTube
— A.R.Rahman (@arrahman) October 30, 2020
ఇక తాజాగా భారత ప్రధాని మోడీ కూడా ఈ వీడియో చూశారు. అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ఆ చిన్నారిని ప్రశంసించారు. ఎస్తేర్ ను చూస్తే గర్వంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందరూ మా తుజే సలాం అంటూ పోస్టులు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mizoram, Narendra modi, Pm modi, VIRAL NEWS