గొప్ప పనులు చెప్పటమే కాదు. ఆచరించి చూపాలి. అప్పుడే ప్రజలు కూడా తమ నాయకుడిని అనుసరిస్తారు. ప్రస్తుతం కొంత మంది నాయకులు.. పెద్ద మాటలు, గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆచరణలో మాత్రం అవేం పాటించరు. కానీ కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా గొప్ప పనుల గురించి చెబుతూ.. తాము కూడా ఆచరిస్తుంటారు. అధికారం, హోదాలను అసలు పట్టించుకోరు. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇంటిగ్రేటేడ్ ట్రాన్సిట్ కారిడర్ లో (ITPO tunnel) తన చేతులతో స్టేడియంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ ను తీసి చెత్త బుట్టలో వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ మారింది.
పూర్తి వివరాలు.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ఢిల్లీలో ఇంటిగ్రేటేడ్ ట్రాన్సిట్ కారిడర్ ప్రాజెక్ట్ లో (Delhi ITPO Programme) భాగంగా సొరంగం తనిఖీ ప్రారంభోత్సం మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంలో ఉన్న ఏర్పాట్లను చూశారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మోదీ స్టేజీవద్ద ఒక బాటిల్, కొత్త చెత్తను గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి బాటిల్ ను, చెత్తను తీసేసి అక్కడే ఉన్న చెత్తబుట్టలో వేశారు.
Even during inauguration of the ITPO tunnel, PM @NarendraModi ji made it a point to pick up garbage and ensure cleanliness. pic.twitter.com/HcKb76pZT3
— Piyush Goyal (@PiyushGoyal) June 19, 2022
దీనిపై పీయుష్ గోయల్ (Piyush goyal) తన ఇన్ స్టాలో ట్విట్ (Tweet) చేశారు. తమ ప్రభుత్వం స్వచ్చభారత్ మిషన్, క్లీన్ ఇండియాపై మిషన్ లను ఎంత శ్రద్ధగా అమలు పరుస్తున్నామో.. ఈ వీడియో చూస్తే తెలుస్తోందని పీయుష్ గోయల్ అన్నారు.
తమ ప్రభుత్వం స్వచ్ఛభారత్ (Big Swachh Bharat) పాటించాలని చెప్పడం లేదని, తాము కూడా చిత్తశుద్ధితో పాటిస్తున్నామని చెప్పడానికి ఇదోక నిలువటద్దమని పీయుష్ గోయల్ అన్నారు. అదే విధంగా, ప్రధాని మోదీ.. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (Pragathi bhavan) పునరాభివ్రుద్ధిలో కార్యక్రమంలో.. ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రధాన టన్నెల్, మరో ఐదు అండర్ పాస్ లను ఆదివారం మోదీ ప్రారంభించారు. దీని పొడవు సుమారు 1.6 కిలోమీటర్లు ఉంది. దీనిలో ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, ఇండియాగేట్, ఇతర సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాలకు ప్రజలు సులభంగా ప్రయాణించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Azadi Ka Amrit Mahotsav, Delhi, Narendra modi, Pm modi, Swachh Bharat