హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

PM MODI: రెస్టారెంట్ అద్భుతమైన ఆఫర్.. 8.5 లక్షలు గెలుచుకునే చాన్స్.. దానితో పాటు..

PM MODI: రెస్టారెంట్ అద్భుతమైన ఆఫర్.. 8.5 లక్షలు గెలుచుకునే చాన్స్.. దానితో పాటు..

పీఎం మోదీ (ఫైల్)

పీఎం మోదీ (ఫైల్)

Delhi:  ప్రధాని మోదీ ఈరోజు 72 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజంలంతా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తమదైన రీతిలో ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) జన్మదినోవత్సావాన్ని ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలుపెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటికే మోదీ.. 70 ఏళ్ల మన దేశం కలను సాకారం చేశారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను మరోసారి కనిపించేలా చేశారు. నమీబియా నుంచి 8 చీతాలను మన దేశంలోనికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు.వీటిలో 5 ఆడవి కాగా, 3 మగ చిరుతలు. ఇదిలా ఉండగా దేశమంతట మోదీ జన్మదినోత్సవాన్ని ఒక పండగ మాదిరిగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఒక రెస్టారెంట్ ప్రధాని మోదీ పట్ల తన అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తపరచాడు.

పూర్తి వివరాలు.. ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని (Delhi)  రెస్టారెంట్ యజమాని వినూత్నమైన ఆఫర్ను ప్రకటించాడు. సెప్టెంబరు 17 నుంచి 26 వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపాడు. దీనిలో ఫుడ్ థాలిలో.. 56 రకాల వంటకాలు ఉంటాయని చెప్పాడు. అంతే కాకుండా.. వీటికి వెజ్ థాలీ ధర రూ. 2,600, అదే విధంగా, నాన్ వెజ్ థాలీ ధర రూ. 2,900 గా ఉంటుందని తెలిపాడు. వీటిని కేవలం 40 నిముషాల్లో పూర్తిగా తిన్నవారిలో ఒకరిని లక్కీడీప్ లో ఎంపిక చేసి వారికి, రూ. 8.5 క్షల రివార్డు అందజేయడంతో పాటు, కేదార్ నాథ్ దర్శనానికి అయ్యే చార్జీలను తామే భరిస్తామని తెలిపాడు.

థాలీలో ఏమి ఉంటుంది?

థాలీలో 20 రకాల సబ్జీలు, వివిధ రకాల రొట్టెలు, దాల్ మరియు గులాబ్ జామూన్, అలాగే కుల్ఫీ ఎంపిక ఉంటుంది. “థాలీలో ఉత్తర భారతదేశానికి చెందిన 56 వంటకాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం వెజిటేరియన్ థాలీ రూ. 2,600తో పాటు పన్నులు కాగా, నాన్ వెజ్ థాలీ ధర రూ. 2,900తో పాటు పన్నులు. డిన్నర్ థాలీలు ఒక్కో థాలీకి రూ. 300 అదనంగా ఉంటాయి’’ అని ఆయన పంచుకున్నారు. ఈ రెస్టారెంట్ లో పుష్ప థాలీ, బాహుబలి థాలీ కూడా అందుబాటులో ఉన్నాయని రెస్టారెంట్ యజమాని కల్రా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Narendra Modi Birthday, Pm modi, VIRAL NEWS

ఉత్తమ కథలు