హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్... అకౌంట్లలోకి డబ్బు జమ...

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్... అకౌంట్లలోకి డబ్బు జమ...

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్... అకౌంట్లలోకి డబ్బు జమ...

దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్... అకౌంట్లలోకి డబ్బు జమ...

కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే కరోనా కష్టాలు తీరుతూ... కాస్తంత రెవెన్యూ జనరేట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

  దేశంలో కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన వాళ్లలో రైతులు ముందున్నారు. పంటలు పండించేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని మార్కెటింగ్ చేయించడం మరో సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం... కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చింది. దాని రెండో దశ పంపిణీ ప్రారంభించింది. ఈ సీజన్‌లో రైతులను ఆదుకునేందుకు నేటి (శనివారం) నుంచి రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేయబోతోంది. ఈ డబ్బు రైతులకు వ్యవసాయ సంబంధ వస్తువులు, విత్తనాలు, పురుగు మందుల వంటివి కొనుక్కునేందుకు ఉపయోగపడనుంది.

  తెలంగాణలో 3699560 మంది రైతులు ఈ ప్రయోజనం పొందనున్నారు. ఆగస్ట్ 1 నుంచి వీరి అకౌంట్లలో రూ.2000 చొప్పున జమ కానుంది. ఈ డబ్బు అకౌంట్‌లో పడగానే... రైతుల ఫోన్లకు మెసేజ్ వెళ్తుంది. దాన్ని చెక్ చేసుకొని రైతులు... ఏటీఎం కార్డు ద్వారా లేదా... బ్యాంకుకు వెళ్లి... తమ డబ్బును తీసుకోవచ్చు. ఇప్పుడే అవసరం లేదనుకుంటే... అకౌంట్‌లోనే అలా ఉంచుకోవచ్చు. ఏ సమస్యా ఉండదు.

  కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా... దేశంలోని చిన్న రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున ఇస్తోంది. దీని రాష్ట్రాలు అదనంగా తమ వంతుగా ఇస్తున్నాయి. కేంద్రం మూడు దశలుగా ఆ డబ్బును ఇస్తోంది. మూడో విడత డబ్బును ఈ ఏడాది చివర్లో ఇవ్వనుంది.

  కొంత మంది రైతులు తమకు డబ్బు రావట్లేదనీ, తమకు ఈ పథకం అమల్లో ఉందో లేదో తెలియట్లేదని అంటున్నారు. అలాంటి రైతులు... పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/rpt_beneficiarystatus_pub.aspx) లోకి వెళ్లి తమ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే... పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం (https://pmkisan.gov.in/RegistrationForm.aspx)లోకి వెళ్లి... ఆధార్ నంబర్ నంబర్ ఇచ్చి... రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లబ్దిదారులకు అందినట్లే మనీ లభిస్తుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: PM Kisan Scheme