ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి నడి వయస్సు కలిగిన వ్యక్తుల వరకు ఒత్తిడులకు లోనవుతున్నారు. పిల్లలైతే చదువులు, కెరియర్ పేరుతో పెద్దవాళ్లు మానసిక సంఘర్షణలతో గుండెకు ఎక్కువగా కష్టపెడుతున్నారు. అందుకే వయోపరిమితి లేకుండా చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు హార్ట్ ఎటాక్(Heart attack)తో చనిపోతున్న వారి సంఖ్య ఈమధ్య కాలంలో ఎక్కువైంది. గుజరాత్(Gujarat)లో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండె నొప్పితో మధ్యలోనే మైదానంలో కూర్చుండిపోయాడు. తనకు ఏం జరుగుతుందో పక్కన ఉన్న వాళ్లకు చెప్పేలోపే అతని ప్రాణం పోయింది. వసంత్ రాథోడ్(Vasant Rathod)అనే జీఎస్పీ అధికారి మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఓ యువకుడు చూస్తుండగానే ప్రాణాలు వదిలిన వీడియో(Video)సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
క్రికెట్ ఆడుతూ చనిపోయన ఉద్యోగి..
పుట్టుక, చావు ఎవరికి చెప్పి రావనే సామెత నిజమని అర్ధమవుతోంది. గుజరాత్‌లో కీలక పట్టణంగా ఉన్న అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి లైవ్ డెత్ వీడియోనే ఇందుకు సాక్ష్యంగా మారింది. సురేంద్రనగర్ జిల్లా పంచాయితీకి జీఎస్టీ అధికారులకు మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. జీఎస్టీ అధికారుల తరపున ఆ జట్టులో వసంత్ రాథోడ్ అనే యువకుడు క్రికెట్ ఆడాడు. మైదానంలో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ వేస్తూ కొద్దిగా అసౌకర్యంగా ఫీలయ్యాడు. మ్యాచ్ జరగుతుండగానే బౌలింగ్ వేయడం ఆపేసి రిలాక్స్ అవుదామని మైదానంలో కూర్చున్నాడు. కాసేపు ఏం జరుగుతుందో అతనికే అర్ధం కాకపోవడంతో రెండు కాళ్ల మధ్యలో తల పెట్టుకొని బాధపడుతూనే కుప్పకూలిపోయాడు.
క్రికెట్ మైదానంలో లైవ్ డెత్..
ఇదంతా చూస్తున్న ఎంపైర్, తోటి ఆటగాళ్లు పరిగెత్తుకుంటూ వసంత్ రాథోడ్ దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అతను సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడంతో కాసేపు చేతులు, కాళ్లను రుద్దారు. సీపీఆర్ చేశారు. ఇంతలోనే వసంత్ రాథోడ్ క్రికెట్ మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు అతడ్ని ఆసుపత్రికి తరలిస్తే డాక్టర్లు హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లుగా తెలిపారు.
అందరూ చూస్తుండగనే ఆగిన ప్రాణం..
హాయిగా క్రికెట్ ఆడుకుందామని వచ్చిన ఓ ఉద్యోగి గుండెపోటుతో చనిపోవడం తోటి ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యుల్ని కుంగదీసింది. అయితే వసంత్ రాథోడ్ క్రికెట్ బౌలింగ్ చేసేందుకు వెళ్లి మైదానంలోనే ప్రాణాలు వదిలిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. మరణం ఇంత సైలెంట్‌గా మనిషిని మాయం చేస్తుందా అని కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ahmedabad, Gujrath news, Viral Video