మన దేశంలో బంగారాన్ని చాలా మంది సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తారు. అందువల్ల ధంతేరాస్, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగ సందర్భాల్లో బంగారం కొనడానికి ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. ఈ పండుగల సమయంలో బంగారాన్ని కొనడం కేవలం ఒక సంప్రదాయంగానే కాదు, తెలివైన పెట్టుబడిగా మార్గంగా కూడా చాలా మంది భావిస్తారు. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు వచ్చే పండుగను ధంతేరాస్ లేదా ధంత్రయోదశి అంటారు. ఆ రోజు లక్ష్మీదేవి మరియు సంపద దేవుడు కుబేర జీ ఆరాధనతో పాటు బంగారం, వెండి మరియు ఇత్తడి పాత్రలను కొనే సంప్రదాయం కూడా ఉంది. అందువల్ల దీపావళి సమీపిస్తున్న కొద్దీ చాలామంది భారతీయులు గోల్డ్ కాయిన్ లేదా జ్యువెలరీని కొనాలని యోచిస్తారు. మార్కెట్లో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడంతో పాటు బంగారంలో పెట్టుబడికి బాండ్లు, సిప్లు వంటి ఎన్నో పెట్టుబడులు మార్గాలు ఉన్నాయి. కానీ ధంతేరాస్ సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు జ్యువెలరీని కొనడానికే ఇష్టపడతారు. ఎందుకంటే, ధంతేరాస్, దీపావళి వంటి పండుగ సందర్భాల్లో బంగారం కొనడం వల్ల కుటుంబంలో శ్రేయస్సు, ఆనందం లభిస్తాయని నమ్ముతారు.
గోల్డ్ కాయిన్స్ లేదా జ్యువెలరీ కొనే ముందు వీటిని పరిశీలించండి
గోల్డ్ ప్యూరిటీ: గోల్డ్ కాయిన్ను కొనడం కంటే జ్యువెలరీని కొనడం చాలా కష్టం. ఎందుకంటే జ్యువలరీలో చాలా డిజైన్లు ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమైన పనే. కానీ గోల్డ్ కాయిన్ను కొనడం కూడా అంత తేలికైన పనేం కాదు. ఎందుకంటే, మీరు గోల్డ్ కాయిన్లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ముందుగా దాని స్వచ్ఛతను తనిఖీ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో గోల్డ్ కాయిన్స్ ప్యూరిటీని కొలవడానికి క్యారెట్ మరియు ఫిట్నెస్ అనే రెండు మార్గాలు ఉన్నాయి. 24 క్యారెట్ అనేది గోల్డ్ యొక్క స్వచ్ఛమైన రూపంగా పరిగణించబడుతుంది, అదే 22 క్యారెట్ బంగారంలో కొంత వెండి, జింక్ వంటి ఇతర లోహాలు కలుస్తాయి. అందుకే 22 క్యారెట్ల బంగారం 24 క్యారెట్ల కంటే ఎక్కువ మన్నికను కలిగి ఉంటుంది. 24 క్యారెట్ బంగారం చాలా మృదువుగా ఉంటుంది. అందువల్ల జ్యువెలరీల తయారీకి 22 క్యారెట్ బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
గోల్డ్ కాయిన్ రీసెల్: కస్టమర్లకు గోల్డ్ కాయిన్స్ లేదా జ్యువెలరీలపై లేబర్ ఛార్జీలు మినహా 100 శాతం రాబడి లభిస్తుంది. అయితే, గోల్డ్ కాయిన్స్తో పోల్చితే జ్యువలరీ తయారీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ గోల్డ్ కాయిన్స్ను లేదా జ్యువెలరీని తిరిగి అమ్మినప్పుడు లేబర్ ఛార్జీలు మీకు తిరిగి చెల్లించబడవు. రీసెల్ చేసే రోజు ఉన్న బంగారం ధరనే తిరిగి పొందుతారు. ఆ రోజుకు మార్కెట్లో బంగారం ధర పెరిగితే మీకు ఇంక్రిమెంట్ లభిస్తుంది. బంగారం ధర తగ్గితే మీకు తగ్గిన ధర లభిస్తుంది.
గోల్డ్ హాల్మార్కింగ్: బంగారం కొనే ముందు మీరు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం హాల్మార్కింగ్. బంగారం కొనుగోలులో కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ను ఏర్పాటు చేసింది. 2021 జనవరి నుండి ప్రతి జ్యువెలరీ షాపు యజమాని హాల్మార్క్ లైసెన్స్ పొంది ఉండటాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras gold