హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Planets Visible From Earth: మరో ఎనిమిది రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో ఐదు గ్రహాలు!

Planets Visible From Earth: మరో ఎనిమిది రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో ఐదు గ్రహాలు!

మరో ఎనిమిది రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో ఐదు గ్రహాలు!

మరో ఎనిమిది రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో ఐదు గ్రహాలు!

Planets Visible From Earth: మీకు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉందా? అంతరిక్షం, గ్రహాలు, నక్షత్రాలు గురించి తెలుసుకునేందుకు ఇష్టపడతారా? అయితే మీకు ఆకాశంలో ఓ అరుదైన అద్భుతాన్ని చూసే అవకాశం దక్కింది.  మార్చి 28న రాత్రంతా ఐదు గ్రహాలను భూమిపై నుంచి చూడవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మీకు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉందా? అంతరిక్షం, గ్రహాలు, నక్షత్రాలు గురించి తెలుసుకునేందుకు ఇష్టపడతారా? అయితే మీకు ఆకాశంలో ఓ అరుదైన అద్భుతాన్ని చూసే అవకాశం దక్కింది. మార్చి 28న రాత్రంతా ఐదు గ్రహాలను భూమిపై నుంచి చూడవచ్చు. బుధుడు(Mercury), శుక్రుడు(Venus), అంగారకుడు(Mars), బృహస్పతి(Jupiter), యురేనస్(Uranus) గ్రహాలు చిన్న 50-డిగ్రీ సెక్టార్‌లో కనువిందు చేస్తాయని స్టార్‌వాక్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ వింతను ఎప్పుడు, ఎలా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

* సూర్యాస్తమయానికి సిద్ధంగా ఉండాలి

ఆకాశంలో ఆవిష్కృతమవుతున్న అరుదైన ఘటనను చూసేందుకు 28న సూర్యాస్తమయం అయిన వెంటనే బైనాక్యులర్స్‌తో సిద్ధంగా ఉండాలి. ఐదు గ్రహాలలో, శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించే అవకాశం ఉంది. అయితే బుధుడు, బృహస్పతిని హోరిజోన్ దగ్గర గమనించవచ్చు. యురేనస్‌ను గుర్తించడం కొంచెం కష్టమేనని స్టార్‌వాక్‌ పేర్కొంది.

ఐదు గ్రహాలు ఖచ్చితంగా ఒక స్ట్రైట్‌ లైన్‌లో కనిపించవు. కానీ భూమి నుంచి వాటిని చూసినప్పుడు దాదాపుగా ఒక ఆర్క్ ఆకారంలో (చంద్రునితో పాటు) కనిపిస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న మరో శుభవార్త ఏంటంటే.. ఈ గ్రహాల అమరికను ప్రత్యేక పరికరాలు లేకుండా కూడా చూడవచ్చు. అయితే యురేనస్‌ను చూడాలంటే మాత్రం బైనాక్యులర్‌లు అవసరం.

మార్చి 28న జరిగే ఖగోళ దృశ్యాన్ని లార్జ్‌ ప్లానెటరీ అలైన్‌మెంట్‌(పెద్ద గ్రహాల సమలేఖనం ) అంటారు. 5 నుంచి 6 గ్రహాలు ఒకే సమయంలో సూర్యుడికి ఒక వైపు దగ్గరగా ఉంటాయి. ఇలాంటి ఘటన చివరిసారి 2022 జూన్‌లో జరిగింది.

* రాబోయే నెలల్లో భూమి నుంచి కనిపించే ప్లానెట్‌ అలైన్‌మెంట్స్‌ ఇవే

ఏప్రిల్ 11: బుధుడు, యురేనస్‌, శుక్రుడు, అంగారకుడు

ఏప్రిల్ 24: బుధుడు, యురేనస్, శుక్రుడు, అంగాకరకుడు

మే 29: యురేనస్, బుధుడు, బృహస్పతి, శని

జూన్ 17: బుధుడు, యురేనస్, బృహస్పతి, నెప్ట్యూన్, శని

జులై 26: బుధుడు, శుక్రుడు, అంగారకుడు

ఆగస్టు 24: బుధుడు, అంగారకుడు, శని

ఇది కూడా చదవండి : ఇకపై నదిలోనూ ప్రయాణించనున్న అంబులెన్స్‌ ! ఐడియా అదిరిందిగా...!

* ప్రజల్లో ఆసక్తి

ఈ గ్రహాల అరుదైన అమరికను చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు మరింత సమాచారం షేర్‌ చేయాలని కోరుతున్నారు. ఇంకొందరు వాతావరణ పరిస్థితుల కారణంగా తమకు చూసే అవకాశం ఉండకపోవచ్చని విచారం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఓ పోస్ట్‌లో..‘నాకు ఇలాంటి అంశాలు చాలా ఇష్టం. కానీ ఆకాశం మేఘావృతమై ఉన్న ప్రాంతాల్లో నుంచి ఇలాంటి అద్భుతాలను చూడటం కష్టం. కానీ ఈ అరుదైన గ్రహాల అమరిక ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఊహించుకుంటాను.’ అని పేర్కొన్నారు.

మరో యూజర్‌ చేసిన పోస్ట్‌లో..‘వాతావరణం అనుకూలంగా మారితే బావుంటుంది. ఇప్పుడు వర్షం కారణంగా పక్క వీధిని కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితిలో ఉన్నాం.’ అని చెప్పారు. ఇన్‌స్టా యూజర్‌.. ‘ఎప్పుడు? అన్ని దేశాల్లో కనిపిస్తుందా? ఏ సమయంలో చూడవచ్చు? దయచేసి మరిన్ని వివరాలు షేర్‌ చేయండి.’ అని కోరారు.

First published:

Tags: Planets, Trending, VIRAL NEWS

ఉత్తమ కథలు