news18-telugu
Updated: December 27, 2019, 10:32 AM IST
కుప్పకూలిన విమానం... 9 మంది మృతి (credit - twitter - Hamadi Aram)
కజకిస్థాన్లో వంద మంది ప్రయాణికులతో వెళ్తున్న బెక్ ఎయిర్ జెట్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయినట్లు తెలిసింది. అల్మాటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచీ బయలుదేరిన విమానానికి కాసేపటికే సిగ్నల్స్ కట్ అయ్యాయనీ, ఫలితంగా అది రెండంతస్థుల భవనంలోకి దూసుకుపోయిందని చెబుతున్నారు. ఈ విమానం రాజధాని నూర్-సుల్తాన్కి వెళ్లాల్సి ఉంది. టేకాఫ్ అవుతున్నప్పుడు... అది కాంక్రీట్ ఫెన్స్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. అలా ఢీ కొట్టినప్పుడే తేడా వచ్చిందనీ, ఆ తర్వాత సిగ్నల్స్ పోవడంతో... విమానం తిన్నగా వెళ్లి... ఓ చిన్న ఇంటిని ఢీకొట్టిందని అంటున్నారు. ప్రమాదం జరిగిన చోట విమానం ముక్కలవ్వగా... ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఆ దృశ్యాల్ని మనమూ చూడొచ్చు.
Published by:
Krishna Kumar N
First published:
December 27, 2019, 9:42 AM IST