ఎయిర్ పోర్టులో బిడ్డను మరిచి ఫ్లైట్ ఎక్కిన తల్లి... ఫ్లైట్ యూటర్న్

తన బిడ్డను జెడ్డా ఎయిర్ పోర్టులోని డిపార్చర్ వెయిటింగ్ హాల్ వద్ద మరిచిపోయి వచ్చానని చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక విమాన సిబ్బంది వెంటనే సమాచారన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు అందించారు.

news18-telugu
Updated: March 12, 2019, 12:30 PM IST
ఎయిర్ పోర్టులో బిడ్డను మరిచి ఫ్లైట్ ఎక్కిన తల్లి... ఫ్లైట్ యూటర్న్
నమూనా చిత్రం
news18-telugu
Updated: March 12, 2019, 12:30 PM IST
అందరూ షాక్ అయ్యే ఘటన ఇది. సాధారణంగా ఏ తల్లి చేయలేని పని. తనను తాను మర్చిపోతుంది కానీ...ఏ కన్నతల్లి కూడా కన్నబిడ్డను మాత్రం మరిచిపోదు. కానీ... ఓ తల్లి మాత్రం పసికందును ఎయిర్ పోర్టులోనే వదిలేసి మరిచిపోయి ఫ్లైటెక్కింది. కాస్త దూరం వెళ్లాక తన బిడ్డ లేదన్న విషయాన్ని గుర్తించి కంగారుపడింది. వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించి.. ఫ్లైట్‌ను వెనక్కి తిప్పాలని కోరింది. అయితే ఎమర్జెన్సీ పరిస్థితులను మినహాయిస్తే.. ప్రయాణికులు ఎలాంటి వస్తువులైనా మరిచిపోతే.. విమానాల్ని వెనక్కి మళ్లించే పరిస్థితి ఉండదు. కానీ... ఇక్కడ తల్లి పడ్డ ఆవేదనతో విమాన సిబ్బంది సైతం ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు. మళ్లీ ఎయిర్ పోర్టుకు విమానాన్ని తరలించారు. సౌదీ అరేబియాలోని అబ్దులజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జెడ్డా నుంచి కౌల లాంపూర్ వెళ్లేందుకు ఎస్వీ838 నెంబర్ గల విమానం సిద్ధంగా ఉంది.

ప్రయాణికులంతా వచ్చి విమానం ఎక్కగానే... ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. ఇంతలో ఓ మహిళ ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించాలంటూ పైలట్లను కోరింది. తన బిడ్డను జెడ్డా ఎయిర్ పోర్టులోని డిపార్చర్ వెయిటింగ్ హాల్ వద్ద మరిచిపోయి వచ్చానని చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక విమాన సిబ్బంది వెంటనే సమాచారన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు అందించారు. అక్కడ అధికారులకు ఇది విని షాక్ అయ్యారు. ఫ్లైట్ వెనక్కి రప్పించేందుకు ఒకే చెప్పడంతో తిరిగి జెడ్డాకు మళ్లించారు. విమానం ల్యాండయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...