హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Plane Crash : పాకిస్థాన్ విమాన ప్రమాద సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్...

Plane Crash : పాకిస్థాన్ విమాన ప్రమాద సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్...

Plane Crash : పాకిస్థాన్ విమాన ప్రమాద సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్... (credit - twitter)

Plane Crash : పాకిస్థాన్ విమాన ప్రమాద సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్... (credit - twitter)

Pakistan Plane Crash : చూస్తుండగానే ఆ విమానం... రన్‌వే పై దిగాల్సినది కాస్తా... అలా వెళ్లి కూలిపోయి... కాలిపోయింది.

Pakistan Plane Crash : పాకిస్థాన్ కరాచీలో నిన్న కూలిన విమానం 8303 ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయ్యింది. విమానం కూలిపోయిన కొన్ని క్షణాల ముందు... ఆ ప్రమాదం ఎలా జరిగిందే... ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ల్యాండ్ అయ్యే నిమిషం ముందు జరిగిన విషాదం ఇది. ఫుటేజ్‌లో విమానం కాస్త పక్కకు ఒరిగి... భూమివైపు దూసుకెళ్తూ... భవనాల మధ్య నుంచి వెళ్తూ... భవనాలపైనే కూలి... ఒక్కసారిగా పేలుడు వచ్చి... పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాల్ని అక్కడి ఓ సీసీటీవీ రికార్డ్ చేసింది. తద్వారా ప్రపంచం ఆ విషాదం ఎలా జరిగిందో చూడగలుగుతోంది.

పాకిస్తాన్‌లోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఐ) విమానం శుక్రవారం ఉదయం కూలిన ఈ ప్రమాదంలో 97 మంది మరణించారు. విమానాశ్రయంలో దిగడానికి నిమిషం ముందు సాంకేతిక లోపం కారణంగా విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది.

డాన్ ప్రకారం, లాహోర్ నుంచి ఫ్లైట్ పికె -8303 వస్తోంది. మాలిర్ మోడల్ కాలనీకి సమీపంలో ఉన్న జిన్నా గార్డెన్ దగ్గర కుప్పకూలక ముందు విమానం కరాచీలో దిగబోతోంది. పిఐఎ ఎయిర్‌బస్ ఎ 320లో 91 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో మొత్తం 107 మంది ఉన్నారని గతంలో పిఐఐ తెలిపింది. అయితే, కొంతమంది విమానం ఎక్కలేదని తర్వాత తెలిసింది.

ఈ విషాదం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వాళ్లు... అయ్యో... అరెర్రెర్రే అంటూ... విచారం వ్యక్తం చేస్తున్నారు. విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులను రక్షించారు. వారిలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ చైర్మన్ జాఫర్ మసూద్ కూడా ఉన్నారు.

First published:

Tags: Pakistan, Plane Crash

ఉత్తమ కథలు