Home /News /trending /

PILOTS OF THE AEROPLANE FLYING WITH PASSENGERS SLEEP WHILE FLIGHT IS IN OPERATION IN AFRICA AK

Pilots Sleep: విమానం నడుపుతూ నిద్రపోయిన పైలెట్లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pilots Sleeping In Plane: విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా విమానం నంబర్ ET343 ల్యాండ్ కాకపోవడంతో ATC హెచ్చరిక జారీ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    అజయ్ దేవగన్ చిత్రం 'రన్‌వే 34'‌లో విమానం నడిపే పైలెట్‌గా ఉన్న అతడు నిద్రపోతాడు. అయితే ఈ సంఘటన నిజజీవితంలో జరిగితే ఏమౌతుందో ఒక్కసారి ఊహించుకోవడం కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి ఘటనే ఓ ఆఫ్రికా దేశంలో జరిగింది. ఆఫ్రికన్ దేశమైన ఇథియోపియాలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం నడుపుతున్న సమయంలో పైలట్‌లు (Pilots) ఇద్దరూ నిద్రపోయారు. వీరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి పైలట్‌ను సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అది విఫలమైంది. నిర్ణీత రన్‌వే నుంచి విమానం ముందుకు వెళ్లడంతో కలకలం రేగింది. ఈ సంఘటన ఫ్లైట్ నంబర్ ET343. ఈ విమానం సూడాన్(Sudan) రాజధాని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా (Indonesia) రాజధాని అడిస్ అబాబాకు వస్తోంది. భూమి నుంచి 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలోని పైలట్‌లు ఇద్దరూ నిద్రలోకి జారుకుంటే అందులో ప్రయాణిస్తున్న వారి ఊపిరి ఆగిపోవడం ఖాయం.

    3 గంటల ప్రయాణంలో పైలట్లు ఇద్దరూ ఫ్లైట్‌ను ఆటో మోడ్‌లో ఉంచి నిద్రపోయారు. అయితే విమానం నిర్ణీత రన్‌వే మీదుగా వెళ్లి ల్యాండ్ కాకపోవడంతో విమానం లోపల అలారం మోగడంతో పైలట్లకు నిద్రపోయింది. తమ తప్పును గుర్తించిన వెంటనే వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయితే అంతకు మించి పైలట్ల అజాగ్రత్త కారణంగా నిర్ణీత రన్‌వేపై విమానం ల్యాండ్ కాకపోవటంతో ఏటీసీలో కూర్చున్న సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. ఏవియేషన్ హెరాల్డ్ కథనం ప్రకారం..ఈ సంఘటన గత సోమవారం జరిగింది.



    విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా విమానం నంబర్ ET343 ల్యాండ్ కాకపోవడంతో ATC హెచ్చరిక జారీ చేసింది. విమానయాన నిపుణుడు అలెక్స్ మాచెరాస్ కూడా ఫ్లైట్ సమయంలో పైలట్‌లిద్దరూ నిద్రలోకి జారుకున్న ఘటనపై ట్వీట్ చేశారు. ఏవియేషన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. ఫ్లైట్ ల్యాండ్ కావాల్సిన దాని నిర్దేశిత రన్‌వే పైకి వెళ్లినప్పుడు, ఆటోపైలట్ మోడ్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ చేయబడింది.

    Bachelor Father: పెళ్లి చేసుకోలేదు, మహిళలతో రిలేషన్ పెట్టుకోలేదు.. అయినా 48 మంది పిల్లలకు తండ్రి.. అదెలాగంటే..

    Russia: రష్యా మహిళలకు పుతిన్ బంపర్ ఆఫర్.. అలా చేస్తే రూ. 13 లక్షల రివార్డు.. పూర్తి వివరాలు

    ఆ తర్వాత అలారం మోగడంతో పైలట్లిద్దరూ నిద్ర నుంచి లేచారు. దీని తరువాత సుమారు 25 నిమిషాల తర్వాత రన్‌వేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు విమానాన్ని కదిలిస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. మే నెలలో న్యూయార్క్ నుంచి రోమ్‌కు వెళుతుండగా పైలట్‌లిద్దరూ నిద్రలోకి జారుకున్న ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Trending news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు