Home /News /trending /

PILOTS OF INDIGO AIRLINES TALK ABOUT SALARY ISSUES DURING EMERGENCY FREQUENCY AK

OMG: ఎమర్జెన్సీ సమయంలోనూ దానిపైనే చర్చ.. ఏడుగురు పైలెట్లపై అధికారుల ఆగ్రహం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pilots Salary Talk: ఇండిగో పైలట్లు ఈ ఫ్రీక్వెన్సీకి బదులుగా ఎమర్జెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీలో మాట్లాడడమే కాకుండా దుర్భాషలాడారు.

    ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగులే. ఏ సంస్థలో పని చేసినా.. వారి టార్గెట్ జీతాలే. తమకు జీతాలు ఎప్పుడు పెరుగుతాయనే దానిపై ఉద్యోగుల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఏ పని చేస్తున్నా.. దీనిపై చర్చ జరగడం సర్వసాధారణం. అయితే ఇలాంటి చర్చ ఇప్పుడు ఏడుగురు ఉద్యోగుల ఉద్యోగానికి ఎసరొచ్చేలా చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 7 మంది పైలట్లు వ్యవహరించిన తీరు పట్ల కఠిన చర్యలు తీసుకోవచ్చని అధికారులు తేల్చారు. వారు విమానం ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. వాళ్లు జీతం గురించి మాట్లాడుకున్నారు. ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ చేపట్టింది. ఈ విషయంలో విమానయాన సంస్థల నుంచి ఎలాంటి స్పందన లేదు.

    ఈ సంఘటన ఏప్రిల్ 9 న జరిగింది. ఇందులో ఇండిగో విమానాల పైలట్లు ఎమర్జెన్సీలో ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ (121.5 MHz)లో తమలో తాము మాట్లాడుకుంటున్నారు. విమానం సమస్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్రీక్వెన్సీలో సందేశాలు మార్పిడి చేయబడతాయి. అందుకే ఈ ఫ్రీక్వెన్సీలో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ మెసేజ్‌లన్నీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తాయి. దీని కారణంగా ఇండిగో పైలట్ల ఈ అనధికారిక సంభాషణ బయటపడింది. పైలట్ల పరస్పర చర్య కోసం 123.45 MHz సెట్ చేశారు. ATC దీన్ని పర్యవేక్షించదు.

    అయితే ఇండిగో పైలట్లు ఈ ఫ్రీక్వెన్సీకి బదులుగా ఎమర్జెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీలో మాట్లాడడమే కాకుండా దుర్భాషలాడారు. వారి మధ్య చర్చనీయాంశం వారి జీతానికి సంబంధించిన అంశాలు, దానిపై వారు యాజమాన్యంపై అసంతృప్తిగా ఉన్నారు. ఇండిగో యాజమాన్యం కొద్దిరోజుల క్రితమే కొంతమంది పైలట్లను సస్పెండ్ చేయడం గమనార్హం. జీతానికి సంబంధించిన సమస్యలపై మాత్రమే ఈ వ్యక్తులు ఏప్రిల్ 5వ తేదీన సమ్మె చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Trending News: మరికొద్దిరోజుల్లో పెళ్లి.. మంచుతో నిండిపోయిన ప్రాంతంలో ఇరుక్కుపోయిన జవాన్.. అధికారులు ఏం చేశారంటే..

    OMG: వీళ్లేం ప్రేమికులు..అదేం పెళ్లి..వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు

    క‌రోనా శ‌కంలో జీతాలు చెల్లించని వారికి ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్‌ను ఆమోదించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ బంద్ ప్లాన్ చేశారు. అయితే ఏప్రిల్ 1న పైలట్ల జీతాన్ని 8% పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అలాగే నవంబర్‌లో 6.5% పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే కరోనా కాలంలో తమ జీతం 30% తగ్గిందని పైలట్లు చెబుతున్నారు. కాబట్టి ఈ పెంపు కూడా అందుకు అనుగుణంగానే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: IndiGo, Pilot

    తదుపరి వార్తలు