HOME »NEWS »TRENDING »pilot spots very shiny ufo over pakistan speculations on aliens sk

Aliens: పాకిస్తాన్‌లో ఏలియన్స్ కలకలం.. ఆకాశంలో అదేంటి? వైరల్ వీడియో

Aliens: పాకిస్తాన్‌లో ఏలియన్స్ కలకలం.. ఆకాశంలో అదేంటి?  వైరల్ వీడియో
ఆకాశంలో కనిపించిన UFO

సాయంత్రం 05.30 గంటల సమయంలో ఆ UFOని ఆకాశంలో చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపు, ఆరెంజ్ రంగులోకి మారిపోయిందని చెప్పారు. కాసేపటికి ఎర్రటి రంగులోకి మారిందని అంటున్నారు.

  • Share this:
    ఈ అనంత విశ్వంలో భూమితో పాటు అనేక గ్రహాలున్నాయి. ఇక్కడ మనుషులు జీవిస్తున్నట్లే ఇతర గ్రహాల్లో కూడా మనుషుల్లాంటి జీవులు జీవించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వారినే గ్రహాంతర వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలేవీ లభించన్పటికీ .. ఆకాశంలో అప్పుడప్పుడూ చోటుచేసుకునే పరిణామాలు మాత్రం బలం చేకూర్చుతున్నాయి. వింత వస్తువులు కనిపించడం, భూమి మీదకు సిగ్నల్స్ రావడం వంటివి ఇందుకు ఉదాహరణ. తాజాగా మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో గ్రహాంతరవాసుల కలకలం రేగింది. ఆకాశంలో UFO (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) కనిపించడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.




    జనవరి 23న సాయంత్రం వేళ పాకిస్తాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం (AirBus-A320) లాహరో నుంచి కరాచీకి బయలుదేరింది. విమానం రహీంయార్ ఖాన్ ప్రాంతం పై నుంచి వెళ్తున్న సమయంలో విమాన పైలట్లు ఆకాశంలో ఒక వింత వస్తువును గుర్తించారు. కాస్త తేడాగా కనిపించడంతో తదేకంగా వీక్షించారు. అది గుండ్రటి ఆకారంలో, చాలా ప్రకాశవంతంగా కనిపించింది. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

    విమానం నుంచే కాదు.. కింద భూమిపై నుంచి కూడా UFO స్పష్టంగా కనిపించింది. రహీంయార్ ఖాన్ ప్రజలు చాలా మంది ఫొటోలు తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశారు.


    సాయంత్రం 05.30 గంటల సమయంలో ఆ UFOని ఆకాశంలో చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపు, ఆరెంజ్ రంగులోకి మారిపోయిందని చెప్పారు. కాసేపటికి ఎర్రటి రంగులోకి మారిందని అంటున్నారు. ఆకాశంలో వేగంగా ముందుకు కదులుతూ వెళ్లిందని.. దాదాపు గంట తర్వాత మాయమైపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సాధారణ కంటికి కూడా చాలా స్పష్టంగా కనిపించిందని తెలిపాడు.

    ఐతే సాయంత్రం వేళ చంద్రుడి మినహా ఇంకే వస్తువు అంత ప్రకాశవంతంగా కనిపించదని నిపుణులు అంటున్నారు. కానీ అది అంత ప్రకాశవంతంగా ఉందంటే.. ఆలోచించాల్సిన విషయమేనని చెబుతున్నారు. కొందరేమో అది స్పేస్ స్టేషన్ లేదా కృత్రిమ గ్రహం కావచ్చనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఐతే మరికొందరు మాత్రం ఖచ్చితంగా గ్రహాంతరవాసులని అంటున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా పాకిస్తాన్‌లో కనిపించిన ఆ మిస్టరీ ఆబ్జెక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:January 28, 2021, 08:20 IST

    टॉप स्टोरीज